బిజినెస్

18 శాతం పెరిగిన ఐఓసి లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో అతిపెద్దదైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 18 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 3,121.89 కోట్ల రూపాయలుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 18.4 వృద్ధి చెంది 3,696.29 కోట్ల రూపాయలకు చేరుకుందని, చమురు అమ్మకాలు పెరగడమే ఇందుకు కారణమని ఆ సంస్థ స్టాక్ ఎక్స్‌చేంజీకి తెలియజేసింది. దేశంలో చమురు అమ్మకాలు 18.46 మిలియన్ టన్నుల నుంచి 19 మిలియన్ టన్నులకు పెరగగా, ఎగుమతులు 52 శాతం పెరిగి 1.877 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. గత ఏడాది రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 15.6 మిలియన్ టన్నుల ముడి చమురును ఇంధనంగా మార్చిన ఐఓసి రిఫైనరీలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 16.1 మిలియన్ టన్నుల ముడి చమురును ఇంధనంగా మార్చాయి. దీంతో గత ఏడాది లక్ష కోట్ల రూపాయలుగా ఉన్న ఈ సంస్థ ఆదాయం ఈ ఏడాది రూ.1.1 లక్షల కోట్లకు పెరిగింది.
ఐటిసి లాభం 5.59 శాతం వృద్ధి
దేశంలో వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్న దిగ్గజ ప్రైవేటు రంగ సంస్థ ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 5.59 శాతం పెరిగి 2,639.84 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది రెండో త్రైమాసికంలో 2,500.03 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన తాము ఈ ఏడాది ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మరింత నికర లాభాన్ని ఆర్జించ గలిగామని శుక్రవారం ఆ సంస్థ స్టాక్ ఎక్స్‌చేంజీకి తెలియజేసింది.
3.4 శాతం పెరిగిన మారుతీ లాభం
దేశీయ ఆటోమొబైల్ సంస్థల్లో అతిపెద్దదైన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 2,484.3 కోట్ల రూపాయలకు పెరిగింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో 2,401.5 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 3.4 శాతం వృద్ధి చెందిందని ఎంఎస్‌ఐ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.20,048.6 కోట్లుగా ఉన్న తమ నికర అమ్మకాలు ఈ ఏడాది 21.8 శాతం వృద్ధి చెంది 21,438.1 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
రెండు రెట్లు పెరిగిన
హెయిడెల్ సిమెంట్ లాభం
సెప్టెంబర్‌తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో హెయిడెల్‌బెర్గ్ సిమెంట్ ఇండియా సంస్థ నికర లాభం రెండు రెట్లు వృద్ధిచెందింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో 16.5 కోట్ల రూపాయలుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 33.2 కోట్లకు పెరిగిందని, ఖర్చులను తగ్గించుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని ఆ సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్స్‌చేంజీకి తెలియజేసింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.449.8 కోట్లుగా ఉన్న తమ నికర అమ్మకాలు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రూ.419.9 కోట్లకు, మొత్తం ఖర్చులు 438.4 కోట్ల రూపాయల నుంచి 376.8 కోట్ల రూపాయలకు తగ్గాయని ఆ సంస్థ వివరించింది.
15 శాతం క్షీణించిన పివిఆర్ లాభం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ సినిమా హాళ్లను నడుపుతున్న పివిఆర్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 15.13 శాతం క్షీణించింది. దీంతో గత ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 29.13 కోట్ల రూపాయలుగా ఉన్న తమ నికర లాభం ఈ ఏడాది 24.72 కోట్ల రూపాయలకు, మొత్తం ఆదాయం రూ.561.30 కోట్ల నుంచి 559.52 కోట్ల రూపాయలకు తగ్గిందని ఆ సంస్థ శుక్రవారం స్టాక్ ఎక్స్‌చేంజీకి వివరించింది.