బిజినెస్

భాగ్యనగరంలో బెంట్లీ షోరూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: విలాసవంతమైన కార్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు పొందిన బ్రిటిష్ సంస్థ బెంట్లీ మోటార్స్ శుక్రవారం హైదరాబాద్‌లో తమ షోరూమ్‌తో పాటు సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఇప్పటికే రెండు షోరూమ్‌లను నడుపుతున్న ఆ సంస్థకు మన దేశంలో ఇది మూడో షోరూమ్. ఈ సందర్భంగా బెంట్లీ రీజినల్ మేనేజర్ (మిడిల్ ఈస్ట్, ఇండియా, ఆఫ్రికా) నీల్ విల్‌ఫోర్డ్ పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్‌లో తమ కార్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో పాటు పెద్ద నోట్ల రద్దు వలన అందరిపైనా ప్రభావం పడిందని, వీటి వలన అందరి కంటే తమకు ఎక్కువ నష్టం వాటిల్లిందని భావించడం లేదని ఆయన చెప్పారు. భారత్‌లో తమ కార్ల అమ్మకాలు ఏటేటా 15 శాతం పెరుగుతున్నాయని, ప్రస్తుతం పదుల సంఖ్యలో జరుగుతున్న తమ కార్ల అమ్మకాలు ఈ ఏడాది చివరి నాటికి మూడంకెలకు (100 యూనిట్లకు) చేరుకుంటాయని భావిస్తున్నామని బెంట్లీ సంస్థకు చెందిన అధికారులు తెలిపారు.