బిజినెస్

వంకాయలు కిలో రూ.100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదుం, అక్టోబర్ 27: చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం జరిగే వారపుసంతలో కూర గాయలు అన్ని కిలో 70 రూపాయలు ధర పలుకగా వంకాయలు మాత్రం కిలో 100 రూపాయలు ధర పలికింది. ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో తాము కూడా చేసేదిలేక ధరలు పెంచాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. గతనెల రోజులుగా కురిసిన వర్షానికి పండిన కూరగాయలు నీటిలో మునిగిపోయాయని, చేతికి అందిన పంట కూడ పాడైపోవడంతో కూరగాయలకు గిరాకీ పెరిగిందని రైతులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి మరో రెండునెలలు పాటు ఉంటుందని వారు తెలిపారు. కొత్త పంట మార్కెట్‌లోకి వచ్చేంతవరకు ఇలాగే కూరగాయలు ధరలు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. కూరగాయలు కొనేందుకు ఆర్థికస్థోమత లేక ఆకుకూరలతో నే సర్దుకుపోవాల్సి వస్తోందని సామాన్యులు వాపోయారు.