బిజినెస్

బ్యాంకులను ఆదుకునేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: మొండి బకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకునేందుకు రూ.2.11 లక్షల కోట్ల మేర ఉద్దీపనల పథకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ దిశగా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆలోచన చేస్తోంది. బ్యాంకులకు మళ్లీ భారీగా మూల ధనాన్ని కల్పించే విషయమై అనేక అంశాలను పరిశీలిస్తోంది. వీటిలో ప్రధానంగా జీరో కూపన్ బాండ్లను జారీ చేయాలని ఆలోచన కూడా ఉంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, వచ్చే నెలాఖరు నాటికి రూ.1.37 లక్షల కోట్ల మేర రీక్యాపిటలైజేషన్ బాండ్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. జీరో కూపన్ బాండ్లు అనేవి ఒక రకమైన రుణపత్రాలు. డిస్కౌంట్‌పై వీటిని జారీ చేస్తారు. కాలపరిమితి తీరిన తర్వాత దానిపై పేర్కొన్న మొత్తం విలువను చెల్లిస్తారు. ఉదాహరణకు 100 రూపాయల ముఖ విలువ కలిగిన ఈ బాండ్‌ను రెండేళ్ల కాల వ్యవధితో 85 రూపాయలకే జారీ చేస్తారు. ఆ కాల పరిమితి తీరిన తర్వాత 100 రూపాయలు చెల్లిస్తారు. అంటే 100 రూపాయల బాండ్‌ను 85 రూపాయలకే కొన్న సదరు బాండ్ హోల్డర్‌కు రెండేళ్ల తర్వాత వడ్డీ రూపంలో 15 రూపాయలు లభిస్తుందన్నమాట. ఎన్‌పిఎల సమస్యతో కునారిల్లుతున్న బ్యాంకింగ్ వ్యవస్థను ఆదుకునేందుకు ఉద్దీపన పథకంలో భాగంగా అనేక మార్గాల్లో 2.11 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాల వ్యవధిలో ఇంత మొత్తాన్ని వివిధ రూపాల్లో బ్యాంకులకు ప్రభుత్వం సమకూరుస్తుంది. బడ్జెట్ పరంగా మద్దతు. ఈక్విటీ తగ్గింపు, రీక్యాపిటలైజేషన్ బాండ్లు, జీరో బాండ్లు.. ఇలా అనేక మార్గాల్లో ఈ నిర్ధేశిత మొత్తాన్ని బ్యాంకులకు ప్రభుత్వం సమకూరుస్తుంది.