బిజినెస్

సెనె్సక్స్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 27: మారుతీ సుజుకీ లాంటి బ్లూచిప్ కంపెనీల సానుకూల రెండో త్రైమాసిక ఫలితాలు, అలాగే నవంబర్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ సిరీస్ ప్రారంభం కావడం వంటి అనేక సానుకూల అంశాలు శుక్రవారం జరిగిన మార్కెట్ లావాదేవీల్లో సెనె్సక్స్‌కు మరింత ఊతాన్నిచ్చాయి. హ్యాట్రిక్ విజయంతో ఈ వారం సెనె్సక్ లావాదేవీలు ముగిశాయి. తాజాగా 10.09 పాయింట్లే పెరిగినప్పటికీ ఇది కూడా సెనె్సక్స్‌కు కొత్త రికార్డే. శుక్రవారం లావాదేవీలు ముగిసే సమయానికి సెనె్సక్స్ 33,157.22 పాయింట్లకు చేరుకుంది. అయితే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ మాత్రం 20.75 పాయింట్లు కోల్పోయి 10,323.05 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెనె్సక్స్ ఏకంగా 767.26 పాయింట్లు పుంజుకుంది. జనవరి 27 నుంచి ఒకే వారంలో సెనె్సక్స్ ఇన్ని పాయింట్లు పంజుకోవడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. నిఫ్టీ కూడా ఈ వారంలో 176.50 పాయింట్లు పెరిగింది. ఆదివారం నాడు జిఎస్‌టి మండలితో ఎంఎస్‌ఎంఇలు సమావేశం కానుండటం, చిన్న, మధ్యతరహా షేర్లకు ఊతాన్నిచ్చింది. నేటి లావాదేవీల్లో హెల్త్‌కేర్ షేర్లు 1.61 శాతం, వినియోగ వస్తువుల షేర్లు 0.28 శాతం, ఎఫ్‌ఎంసిజి షేర్లు 0.23 శాతం, ఐటి షేర్లు 0.08 శాతం పెరగగా, టెలికామ్, బ్యాంకింగ్, టెక్నాలజీ తదితర రంగాల షేర్ల విలువ 5.06 శాతం మేరకు తగ్గింది. నేటి లావాదేవీల్లో భారీగా లాభపడిన వాటిలో యునైటెడ్ స్పిరిట్స్ (18 శాతం), అదానీ పోర్ట్స్ (4.31 శాతం), సన్ ఫార్మా (3.65 శాతం), ఓఎన్‌జిసి (3.53 శాతం), టాటా మోటార్స్ (2.55 శాతం) షేర్లు ఉన్నాయి.