బిజినెస్

కరెంటు ఖాతా లోటు 40 బిలియన్ డాలర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ కరెంటు ఖాతా లోటు (సిఎడి) సుమారు 40 బిలియన్ డాలర్లు లేదా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 1.5 శాతం ఉంటుందని నోమురా నివేదిక అంచనా వేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంతానికి కరెంటు ఖాతా లోటు వేగంగా 14.3 బిలియన్ డాలర్లకు అంటే జిడిపిలో 2.4 శాతానికి పెరిగింది. సాధారణంగా మారకం రేటు ఆధారంగా విదేశీ మారక ద్రవ్యం రాక, పోకల మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు సూచిస్తుంది. జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం నోమురా అంచనా ప్రకారం జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి భారతదేశ కరెంటు ఖాతా లోటు జిడిపిలో సుమారు 1.6 శాతం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగం (ఏప్రిల్- సెప్టెంబర్) కరెంటు ఖాతా లోటు జిడిపిలో సుమారు రెండు శాతం ఉంటుంది. ‘ఈ మొత్తం ఆర్థిక సంవత్సరానికి కరెంటు ఖాతా లోటు 40 బిలియన్ డాలర్లు లేదా జిడిపిలో 1.5 శాతంగా ఉంటుందని అంచనా వేశాం’ అని నోమురా తన అధ్యయన నివేదికలో తెలిపింది. అంటే 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం కరెంటు ఖాతా లోటు 0.7 శాతం పెరుగుతుందని అంచనా.
నోమురా అధ్యయనం ప్రకారం, తాత్కాలిక కారణాల వల్ల ఏప్రిల్- సెప్టెంబర్ త్రైమాసికంలో వ్యాపార వ్యత్యాసం (ఎగుమతి, దిగుమతుల తేడా) పెరిగింది. రెండో అర్ధ భాగం (అక్టోబర్- మార్చి)లో ఈ వ్యాపార వ్యత్యాసం తగ్గుతుందని అంచనా. ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో వ్యాపార వ్యత్యాసం తగ్గడానికి, అంటే కరెంటు ఖాతా లోటు తగ్గడానికి దారితీసే నాలుగు కారణాలను కూడా నోమురా వెల్లడించింది. దేశీయంగా సరఫరాలకు అంతరాయం వల్ల పెరిగిన దిగుమతులు తగ్గుతాయి. ధరల పోటీ వల్ల లాభం కలుగుతుంది. బంగారు దిగుమతులు సాధారణ స్థాయికి చేరడం. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సంబంధిత అంతరాయాలు తగ్గడం. ఈ అంతరాయాలు తగ్గడం వల్ల ఎగుమతులు పెరుగుతాయి. ‘మొత్తం భారత్ కరెంటు ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో తాత్కాలిక కారణాల వల్లనే అధ్వాన్న స్థితికి చేరుకుందని, రెండో అర్ధ భాగంలో వ్యాపార వ్యత్యాసం సర్దుకుంటుందని మా విశే్లషణలు వెల్లడిస్తున్నాయి’ అని నోమురా తన నివేదికలో పేర్కొంది.