బిజినెస్

రైతుల ఆదాయాన్ని రెండేళ్లలో రెట్టింపు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: దేశంలో 2020 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఏడు అంశాల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని, ‘ప్రతి నీటి బొట్టుకు మరింత పంట’ అనే విధానం కూడా ఇందులో ఉందని గురువారం ఆయన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించిందని, ప్రధాన మంత్రి కృషి సంచారుూ యోజన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన్, సాయిల్ హెల్త్ కార్డు, నీమ్ కోటెడ్ యూరియా (వేప పూత పూసిన యూరియా), ఇ-నామ్ లాంటి పథకాలు వ్యవసాయ ఉత్పాదకతను, రైతులకు రాబడిని పెంచాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకాలేనని రాధా మోహన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించడం ఎలా అనే అంశంపై ప్రత్యేక కమిటీ కూడా అధ్యయనం చేస్తోందని ఆయన వెల్లడించారు.

చిత్రం..కేంద్ర ప్రభుత్వ లక్ష్యం గురించి వివరిస్తున్న రాధా మోహన్ సింగ్