బిజినెస్

రవాణాకు సాంకేతికత దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ ఆర్టీసీ బస్సుల రాకపోకలపై సాంకేతిక విధానం అమలుకు కసరత్తు చేస్తోంది. ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ-విధానంతో రవాణా వ్యవస్థ మరింత పటిష్టం కానున్నట్టు రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం బస్ భవన్‌లో ప్రాన్స్ బృందంతో మంత్రితోపాటు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజా రవాణా వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం, మేథో సంపత్తిని పరస్పరం అందిపుచ్చుకోవడంపై ఫ్రాన్స్ ప్రతినిధులతో చర్చించామన్నారు. హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మరింత పటిష్టపరచేందుకు జిపిఎస్ విధానం ద్వారా పర్యవేక్షించే సామర్థ్యాన్ని మెరుగుపరచుకోనున్నామన్నారు. సాంకేతిక విధానం అమలుకు అయ్యే ఖర్చు మొత్తం ఫ్రాన్స్ ప్రభుత్వంమే భరిస్తుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఫ్రాన్స్ రాయభారి అలెగ్జాండర్ జిగ్నర్ మాట్లాడుతూ, రవాణా రంగంలో టైం చాలా విలువైందని, ఈ విధానం చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈ-విధానం ద్వారా ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని తాము ఆశిస్తుట్టు తెలిపారు. ఈ సందర్భంగా సోలార్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డును పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. టిఎస్‌ఆర్టీసీ పనితీరురు ఫ్రాన్స్ బృందం ప్రశంసించింది.

చిత్రం..ఫ్రాన్స్ బృందంతో తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎండి రమణారావు తదితరులు