బిజినెస్

యానిమేషన్‌కు నెలవు ఇమేజ్ టవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చే ప్రతిష్టాకరమైన ఇమేజ్ టవర్స్‌కు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిరామారావు ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. యానిమేషన్, గేమింగ్ రంగం పరిశ్రమలు ఇమేజ్ టవర్స్‌లో కొలువు తీరనున్నాయి.
22 అంతస్తులతో ఇమేజ్ టవర్స్‌ను రాయదుర్గంలోని మైండ్ స్పేస్ జంక్షన్‌కు సమీపంలో రాష్ట్రప్రభుత్వం నిర్మించనుంది. ఈ టవర్స్ నిర్మాణ బాధ్యతలను టిఎస్‌ఐఐసికి అప్పగించారు. యానిమేషన్ అకాడమికి లక్ష చదరపు అడుగులు, ఇంక్యుబేషన్ సర్వీసస్, బిజినెస్ సెంటర్‌కు నాలుగు లక్షల చదరపు అడుగులు, ఆధునిక టెక్నాలజీతో కూడిన స్టూడియోలకు 1.25 లక్షల చదరపు అడుగులు కేటాయించారు.