బిజినెస్

పారదర్శకతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: గతంలో మాదిరి కాకుండా పాలనలో పారదర్శకత బాగా పెరిగినందున అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దని రాచకొండ సిపి మహేశ్ భగవత్ అన్నారు. ప్రతి ఒక్కరూ అవినీతిపై నిఘా ఉంచి సమాజాన్ని అవినీతి రహితంగా చేసేందుకు సహకరించాలని కోరారు.
శనివారం నాడిక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సి)లో జరిగిన విజిలెన్స్ వారోత్సవాల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రతి పనికి లంచం ఇవ్వనిదే పని అయ్యేది కాదని, ఆ అనుభవం దాదాపు అందరికి ఉండేదని అన్నారు. కానీ క్రమేణా పాలనలో పారదర్శకత, పోలీసు వ్యవస్థ పనితీరులో అద్భుతమైన మార్పులు రావడంతో ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైందని అన్నారు. నిఘా వ్యవస్థ ఏర్పాటులోనూ సిసి కెమెరాల వంటివి ఏర్పాటు కావడంతో అవినీతి తగ్గిందని చెప్పవచ్చన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌భగవత్ విజిలెన్స్ వారోత్సవాల్లో పాల్గొన్న వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఎఫ్‌సి చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జి.కళ్యాణ కృష్ణన్ గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. తమ సంస్థ కొనుగోళ్లు, అమ్మకాల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పూర్తి స్థాయి పారదర్శకతను పాటిస్తోందని అన్నారు. సామాజిక అభివృద్ధికి పారదర్శకత అనేది చాలా అవసరమైనదని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఆర్‌పి ఆచార్య తెలిపారు.

చిత్రం.. విజిలెన్స్ వారోత్సవాల ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న రాచకొండ సిపి మహేశ్ భగవత్