బిజినెస్

భారత్‌లో సువర్ణావకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: వౌలిక సౌకర్యాలు, రవాణా, వ్యవసాయం, ఆహారం తయారీ ప్రక్రియ (్ఫడ్ ప్రాసెసింగ్) వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి భారత్ ప్రపంచ పెట్టుబడిదారులకు సువర్ణావకాశాలను అందిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ రానున్న రెండేళ్లలో హైవేలలో ప్రపంచ స్థాయి వౌలిక సౌకర్యాలను సిద్ధం చేయడమే కాకుండా జలమార్గాలు, వ్యవసాయ రంగాల్లోనూ భారీగా సంస్కరణలను చేపడుతోందని రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్, జలవనరులు, నదుల అభివృద్ధి శాఖల మంత్రి అయిన గడ్కరీ తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా- 2017 సదస్సులో ‘అపార్చ్యునిటీస్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజి అండ్ ఎక్విప్‌మెంట్’ అంశంపై గడ్కరీ మాట్లాడుతూ భారత్‌లో ఆహార తయారీ ప్రక్రియలోనూ పెట్టుబడిదారులకు సువర్ణావకాశాలు ఉన్నాయని తెలిపారు.

చిత్రం..శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ