బిజినెస్

పట్టణ రవాణా ఇక పటిష్ఠం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: పట్టణ రవాణా మెరుగుపరిచేందుకు ఆధునిక వ్యవస్థపై ప్రభుత్వం దృష్టిసారించిందని, అందుకు తగ్గ ప్రోత్సాహకాలను అందిస్తోందని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి హర్‌దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ ప్రారంభమైన అర్బన్ మొబిలిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ నగర ప్రాంత రవాణా వ్యవస్థలు ప్రజలను చేరవేయడం కన్నా కదులుతున్న వాహనాలుగా మిగులుతున్న ధోరణి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేవారు. ఈ పరిస్థితిని తారుమారు చేయాలని అన్నారు. మన నగరాల్లో కార్లను వాడబోమని మనలో చాలా మంది ముందుకు వస్తే అది చాలా పెద్ద వ్యత్యాసాన్ని తీసుకురాగలుగుతందని అన్నారు. వెంకయ్యనాయుడు కేంద్ర కేబినెట్ మంత్రి ఉన్న కాలంలో ఢిల్లీ మెట్రోను ఉపయోగించిన సంగతిని ఆయన ప్రస్తావించారు. దేశంలో నగరీకరణం శరవేగంగా దూసుకుపోతున్నందున నగరాల్లో రవాణా సేవలకు ఎనలేని డిమాండ్ ఉంటోందని పురి అన్నారు. 2002లో ఢిల్లీలో మెట్రో నెట్‌వర్కు కేవలం 8 కిలోమీటర్లు ఉంటే, ఇపుడు దేశంలో పనిచేస్తున్న మెట్రో నెట్‌వర్కుల పరిధి 380 కిలోమీటర్లు ఉందని అన్నారు. మరో 500 కిలోమీటర్లు పేర నిర్మాణం జరుగుతోందని ఆయన వివరించారు. మరో పక్క 250 కిలోమీటర్లు బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం విధులు నిర్వహిస్తుంటే , అదనంగా 250 కిలోమీటర్లు బిఆర్‌టిఎస్ నెట్ వర్కులు నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. సుస్థిర పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడానికి గత మూడేళ్లలో న్యూ అర్బన్ మిషన్‌లలో భాగంగా చేపట్టిన అనేక పథకాలను వివరించారు. స్మార్టు సిటీ మిషన్‌లో భాగంగా సైక్లింగ్, వాకింగ్, విద్యుత్ వాహనాలు వంటి రావాణా వ్యవస్థలను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మొహమూద్ అలీ మాట్లాడుతూ జనాభా సత్వరగతిన పెరుగుతోందని, ఇది ప్రస్తుతం దాదాపు కోటికి చేరిందని అన్నారు. ఇది భారీ ట్రాఫిక్ సంబంధిత సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. హైదరాబాద్ మెట్రో మొదలైతే చెప్పుకోదగ్గ ఉపశమనం కలుగుతుందని, మెట్రో రైలు ప్రాజెక్టు త్వరితంగా పూర్తయ్యేట్టు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. నాగోల్, మియాపూర్ మధ్య 30 కిలోమీటర్ల మేర ఒకటో దశను ఈనెల 28న ఆరంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అన్నారు. ఫ్రాన్స్ రావాణా, జీవావరణం మంత్రి ఎలిజిబెత్ బోర్న్ యుఎంఐ కాన్ఫరెన్స్‌కు రికార్డు చేసి సందేశాన్ని పంపించారు. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ రెండింటి నగరాల భవితవ్యం ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉందన్నారు. జలవాయు పరివర్తన సంబంధ సమస్యల పరిష్కారానికి పరస్పరం సహకరించుకోవల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్‌లర్ మాట్లాడుతూ , ప్రపంచ దేశాల ముందు ఉన్నటువంటి ప్రధానమైన కార్యావళి సుస్థిర అభివృద్ధి అని అన్నారు. భారత్‌తో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని తమ దేశం ఆసక్తితో ఉందని అన్నారు. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ పట్టణ రవాణాకు వేర్వేరు దేశాల్లో అమలుచేస్తున్న విభిన్నమైన పద్ధతుల్లో ఉత్తమ పద్ధతులను ఈ సదస్సు ద్వారా తెలుసుకోగలుగుతామని అన్నారు. ఈ సందర్భంగా వివిధ సేవల్లో ఉత్తమ సంస్థలను గుర్తించారు. అందులో ఉత్తమ బస్ సర్వీసు సూరత్ సిటీ బస్ సర్వీసుకు లభించింది. ఉత్తమ ఎన్‌ఎంటి ప్రాజెక్టుగా మైసూర్‌కు, భోపాల్‌కు దక్కాయి. అత్యుత్తమ సేవలు ఇస్తున్న సంస్థగా నొయిడా సిటీ బస్ సర్వీసుకు , అండమాన్‌కు అవార్డు దక్కింది. ట్రాన్సిట్ సిస్టం అవార్డు మధ్యప్రదేశ్‌కు లభించింది. లక్నో మోటార్ రైలుకు కూడా అర్బన్ మాస్ ట్రాన్సిట్ ప్రాజెక్టు కింద అవార్డు దక్కింది.