బిజినెస్

రికార్డుల ఛేదనకు పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 4: దేశీయ మార్కెట్లు ఈ వారం కూడా సరికొత్త రికార్డులను సృష్టించడానికి పరుగులు తీశాయి. గత వారం పుంజుకున్న మార్కెట్ సూచీలు, అదే ధోరణిని కొనసాగిస్తూ రెండో వారం కూడా పైకి ఎగబాకాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఈ వారం మొత్తం మీద 528.34 పాయింట్లు పుంజుకొని, 33,685.56 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌సి నిఫ్టీ 10,400 స్థాయిని అధిగమించి 10,452.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లలో ఈ వారం సానుకూలంగా ప్రారంభమయిన లావాదేవీలు ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కొన్ని కార్పొరేట్ కంపెనీలు మంచి లాభాలను గడించడంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగడం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక ఊతం ఇవ్వడానికి, కీలకమైన రంగాలను విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం వంటి పరిణామాల మద్దతుతో కీలక దేశీయ మార్కెట్ సూచీలు ముందుకు దూసుకెళ్లాయి. అయితే రికార్డు స్థాయిల్లో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు కొంత పడిపోయినప్పటికీ, ప్రపంచ బ్యాంకు ప్రకటించిన వ్యాపార అనుకూలత గల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దేశాల జాబితాలో భారత్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకి వందో స్థానాన్ని ఆక్రమించడం మదుపరులలో విశ్వాసాన్ని నింపింది. దీంతో వారాంతమయిన శక్రవారం బిఎస్‌ఇ సెనె్సక్స్ ఇంట్రా-డేలో జీవితకాల గరిష్ఠ స్థాయి 33,733.71 పాయింట్లకు చేరుకొని, చివరలో స్వల్పంగా తగ్గి 33,685.56 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయంగా తగినన్ని నిధులు షేర్ మార్కెట్లలోకి రావడం వల్ల దేశీయ వస్తు తయారీ రంగం వృద్ధి మందగించిందన్న పిఎంఐ గణాంకాల ప్రతికూల అంశాన్ని పక్కకు నెట్టి మార్కెట్లు ముందుకు వెళ్లగలిగాయి. విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో రెండు రోజుల పాటు క్రియాశీల కొనుగోలుదారులుగా వ్యవహరించారు. పైగా, ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ జెరోమ్ పావెల్.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ కొత్త చీఫ్‌గా నియమితులు కావడంతో పాటు హౌస్ రిపబ్లికన్స్ పన్ను సంస్కరణలను ఆవిష్కరించడంతో అమెరికా మార్కెట్ రికార్డు గరిష్ఠ స్థాయిల వద్ద ముగియడం, ఆసియా మార్కెట్లు చురుకుగా పరుగులు తీయడం సంభవించింది. ఈ పరిణామాలు భారత మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.
ఈ వారం ప్రారంభంలో గరిష్ఠ స్థాయి 33,260.10 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ జీవిత కాల చారిత్రక గరిష్ఠ స్థాయి 33,733.71 పాయింట్లకు చేరుకొని, చివరకు స్వల్పంగా తగ్గి 33,685.56 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద ఈ వారంలో 528.34 పాయింట్లు (1.59 శాతం) పుంజుకుంది. సెనె్సక్స్ గత వారం 767.26 పాయింట్లు (2.37 శాతం) పెరిగిన విషయం తెలిసిందే.
నిఫ్టీ ఈ వారం బలహీనంగా 10,353.85 పాయింట్ల వద్ద ప్రారంభమయినప్పటికీ, సరికొత్త చారిత్రక మైలురాయి 10,461.70 పాయింట్లను తాకింది. చివరకు స్వల్పంగా తగ్గి మొత్తం మీద 129.45 పాయింట్ల (1.25 శాతం) పెరుగుదలతో 10,452.50 పాయింట్ల వద్ద ముగిసింది.