బిజినెస్

‘ఆధార్’ అనుసంధానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల హాజరు పట్టికలో ఎన్నో మార్పులు సంతరించుకోవడం మనం చూస్తేనే ఉన్నాం. ప్రస్తుతం బయోమెట్రిక్ విధానంలో హాజరు పట్టిక విధానం అమలు జరుగుతోంది. తాజాగా ఈ బయోమెట్రిక్ విధానానికి ‘ఆధార్’ను లింక్ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి. ఈ విధానానికి తొలి అడుగులు వేస్తోంది భారతీయ రేల్వే. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి రైల్వే ఉద్యోగుల హాజరుపట్టికను ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నవంబర్ 3నే అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీచేసింది. ఈ విధానాన్ని ఈ నెల 30నాటికే అన్ని డివిజన్ కార్యాలయాలు, జోన్లు, కోల్‌కతా మెట్రో రైల్వే, వర్క్‌షాపులు, ప్యాక్టరీలలో అమలు చేయనున్నట్లు తెలిపింది. అయితే జనవరి 31 నాటికి రైల్వేలోని అన్ని విభాగాల్లో ఈ ఆధార్ లింక్‌డ్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు రైల్వే అధికారి ఒకరి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. విధులకు ఆలస్యంగా వచ్చేవారిని నియంత్రించేందుకు ఈ విధానం ఎంతో మేలు చేకూరుస్తుందని ఆ అధికారి తెలిపారు.
ఈ విధానం మొత్తం డివిజనల్ రైల్వే మేనేజర్ అధీనంలో ఉంటుందని, అలాగే బయోమెట్రిక్ మిషీన్ల వద్ద సిసిటివి కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.