బిజినెస్

‘హిటాచి వంటూరా’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: ప్రముఖ హిటాచి గ్రూప్ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు డేటా ఆధారిత సేవలను అందించేందుకు గాను హిటాచి వంటారా పేరుతో నూతన కంపెనీని ప్రారంభించింది. హిటాచి గ్రూప్‌లోని అంతర్భాగమైన హిటాచి డేటా సిస్టమ్స్, పెంటహోల కార్యకలాపాలను ఏకీకృతం చేసేదే ఈ నూతన కంపెనీ హిటాచి వంటారా అని హిటాచి లిమిటెడ్ అధ్యక్షుడు తోషియాకి హిగషిహోర తెలిపారు. హిటాచి వంటూరా ప్రత్యేకంగా వినియోగదారులకు సంబంధించి వారి డేటా అందించే మొత్తం విలువను సేకరించేందుకు సహాయం చేస్తుందని తెలిపారు. మార్కెట్ అవకాశాలకు సంబంధించి మిషన్ క్రిటికల్ డేటా పరిష్కరణలనేవి ఎప్పుడూ తలకు మించిన భారంగా లేవని తెలిపారు. డేటా నుంచి చక్కని ఫలితాలను అందుకునే సామర్ధ్యం కలిగి ఉంటే, డేటా అనేది వ్యాపారులకు అతి పెద్ద ఆస్తిగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ ఉపకరణాలు, ప్రాసెస్‌కు పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో తమ వినియోగదారులు, భాగస్వాముల సహకారంతో ఐఓటి యుగంలో ఒక నిజమైన ఆవిష్కరణల భాగస్వామిగా ఉండాలన్న అంకిత భావానికి మద్దతు ఇచ్చే రీతిలో హిటాచి వంటూరా రూపుదిద్దుకుందని ఆయన వెల్లడించారు.