బిజినెస్

కార్మిక సంక్షేమ నిధులతో ల్యాప్‌టాప్‌లు కొంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులతో ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మిషన్లు కొనడం ఏమిటని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణరంగ కార్మికుల ప్రయోజనాల కోసం ఏర్పాటైన నిధిలో 29వేల కోట్ల రూపాయలు ఉండగా, పది శాతం మొత్తాన్ని కూడా సంక్షేమం కోసం ఖర్చు చేయకపోవడం విస్మయాన్ని, బాధను కలిగిస్తోందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిర్మాణరంగ కార్మికుల చట్టం మేరకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల్లో సెస్సు వసూలు చేసినా, భారీ మొత్తం నిధులను దుర్వినియోగ పరచారని న్యాయస్థానం తన పరిశీలనలో పేర్కొంది. జస్టిస్ మదన్ బి లోకుర్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, ఇందుకు సంబంధించి వివరాలు తెలియజేసేందుకు ఈనెల 10న కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. నిర్మాణరంగ కార్మికుల కోసం ఉద్దేశించిన నిధులతో ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మిషన్లు కొన్నారన్న ‘విస్మయకర’ వివరాలు ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లు వెలుగు చూశాయి. ఈ వివరాలు చూసి న్యాయమూర్తులు విస్మయానికి లోనయ్యారు.
నిర్మాణరంగ కార్మికులకు కేటాయించిన నిధులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో తెలియజేయాలని గతంలో ‘కాగ్’ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు చేపట్టిన నేపథ్యంలో సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది.
రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి భారీ మొత్తంలో సెస్సు వసూలు చేస్తున్నా నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయడంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. లబ్ధిదారులను గుర్తించేందుకు ఎలాంటి వ్యవస్థ లేకుండా పోయిందని, నిధులను ఎందుకు ఖర్చు చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్న ఆరోపణలపై సుప్రీం స్పందించి, దీనికి సంబంధించి వివరాలను అందించాలని ‘కాగ్’ను ఆదేశించింది. ‘కాగ్’ పరిశీలనలో అత్యంత విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. ‘బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యాక్టు- 1996’ ప్రకారం అధికారులు రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి భారీగా సెస్సును వసూలు చేస్తున్నారు. కార్యనిర్వాహక ఖర్చుల కోసం భారీగా నిధులను ఖర్చు చేయడం పట్ల కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మిక సంక్షేమానికి కేటాయించిన నిధులను ఇలా దుర్వినియోగం కావడం ఎంతమాత్రం సహించరానిదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అవకతవకలను వీలైనంత త్వరగా సరిదిద్దాలని, నిధుల ఖర్చు తీరుతెన్నులను కోర్టు ముందు ఉంచాలని వారు న్యాయశాఖ కార్యదర్శిని ఆదేశించారు. వేల కోట్ల రూపాయల నిధులున్నా అర్హుల కోసం ఖర్చు పెట్టకపోవడాన్ని కోర్టు ఆక్షేపించింది.