బిజినెస్

ఫుడ్ ప్రాసెసింగ్’లోకి పెట్టుబడుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశ ఆహార తయారీ ప్రక్రియ (్ఫడ్ ప్రాసెసింగ్) రంగంలో 11.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో అవగాహనా ఒప్పందాలు కుదిరాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ప్రభుత్వం పెట్టే పెట్టుబడులతో కలుపుకుంటే ఈ రంగంలో మొత్తం పెట్టుబడులు 18.84 బిలియన్ డాలర్లకు చేరాయని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, సిఐఐ సంయుక్తంగా ఇక్కడ నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ ముగింపు కార్యక్రమంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ ప్రతి 50 అవగాహనా ఒప్పందాల (ఎంఓయుల)కు ఒకటి చొప్పున ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అవగాహనా ఒప్పందాలు వాస్తవంగా కార్యరూపం దాల్చేట్లు చూడటంతో పాటు ప్రస్తుతం పది శాతం ఉన్న ఆహార ప్రక్రియ స్థాయిలు మరింత పెరిగేందుకు ఈ ప్రత్యేక విభాగం అంకిత భావంతో కృషి చేస్తుందని ఆమె వివరించారు. వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమం సందర్భంగా ఆహార తయారీ ప్రక్రియలో 11.25 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 74వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 50 అవగాహనా ఒప్పందాలు కుదిరినట్టు తెలియజేయడానికి తాను సంతోషిస్తున్నానని కౌర్ అన్నారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ ఈ రంగంలో వౌలిక సౌకర్యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున వ్యయం చేయబోతోందని, దీనిని కూడా కలుపుకుంటే ఈ రంగంలో మొత్తం పెట్టుబడులు 18.84 బిలియన్ డాలర్లకు చేరుతున్నాయని ఆమె వివరించారు. ఇందులో 2.5 బిలియన్ డాలర్ల విలువ గల ఎంఓయూలు రాష్ట్ర ప్రభుత్వాలు, భాగస్వాముల (స్టేక్‌హోల్డర్ల)కు మధ్య కుదిరాయని మంత్రి వెల్లడించారు. ఈ ఒప్పందాలలో భాగంగా పంజాబ్, హర్యానాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులను దక్కించుకున్నాయని ఆమె తెలిపారు. భారత ఆహార తయారీ ప్రక్రియలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), జర్మనీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ప్రకటించాయని మంత్రి తెలిపారు. ఆహార తయారీ ప్రక్రియ, బేవరేజెస్, లాజిస్టిక్స్, హోల్‌సేల్ అండ్ రిటెయిలింగ్, ఈ-కామర్స్, సేంద్రియ వ్యవసాయం తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయని కౌర్ వివరించారు. ‘50 అవగాహనా ఒప్పందాలపై మేము సంతకాలు చేశాం. ఇవి కేవలం మేము సంతకాలు చేసిన కాగితాలే కాదు. దీనికోసం చాలా కసరత్తు చేయడం జరిగింది. చాలా పెద్ద పని జరుగబోతోంది’ అని మంత్రి అన్నారు. అవగాహనా ఒప్పందాల ప్రకారం గ్రౌండ్ లెవెల్, పనులు ప్రారంభమయిన వాటికి పెట్టుబడులు వచ్చేట్టు పూర్తి స్థాయి మద్దతు ఉందని ఆమె తెలిపారు. ప్రతి అవగాహనా ఒప్పందం అమలును తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించడంతో పాటు పెట్టుబడిదారులతో కలిసి అనంతర కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని, బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమంలో 60 దేశాల నుంచి ప్రతినిధులు, 50 మందికి పైగా గ్లోబల్ సీఈఓలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 918 కిలోగ్రాముల కిచ్‌డీని వండటం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి జెపి మీనా, సిఐఐ ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాకేశ్ భారతి మిట్టల్ తదితరులు ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.