బిజినెస్

అక్రమాలకు అడ్డాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: పెద్ద నోట్ల రద్దు తరువాత 35వేల కంపెనీలు రూ. 17వేల కోట్ల పైచిలుకు నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేశాయని, తరువాత ఆ మొత్తాలను ఉపసంహరించుకున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగిందని పేర్కొంది. చాలా కాలం నుంచి పనిచేయకుండా ఉంటూ అక్రమ నిధుల బదిలీకి ఆలవాలంగా మారిన సుమారు 2.24 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రద్దు చేసింది. 3.09 లక్షల మంది బోర్డు డైరెక్టర్లను ఆ పదవులకు అనర్హులుగా ప్రకటించింది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా పనిచేయకుండా ఉన్న 2.24 లక్షల కంపెనీలను అధికారిక రికార్డుల నుంచి తొలగించినట్లు ఒక అధికారిక ప్రకటన ఆదివారం వెల్లడించింది. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. ఆ కంపెనీల ఆస్తుల విక్రయం, బదిలీపైనా నిషేధం విధించినట్లు తెలిపింది. 56 బ్యాంకుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, నోట్ల రద్దు తరువాత 35వేల కంపెనీలకు చెందిన 58వేల బ్యాంకు ఖాతాలలో రూ. 17వేల కోట్ల పైచిలుకు నగదు డిపాజిట్ అయి, ఉపసంహరణ కూడా జరిగిపోయిందని ఆ ప్రకటన వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన 2016 నవంబర్ 8న నెగెటివ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్న ఒక కంపెనీ బ్యాంకు ఖాతాలో నోట్ల రద్దు తరువాత రూ. 2,484 కోట్ల నగదును డిపాజిట్ చేసి, తరువాత విత్‌డ్రా చేయడం జరిగింది. ఒక కంపెనీ ఏకంగా 2,134 బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నట్లు తేలిందని ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని తదుపరి చర్యల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అందజేయడం జరిగిందని తెలిపింది. రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన కంపెనీల ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతించొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వెళ్లాయి. 2013-14 నుంచి 2015-16 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు వార్షిక రిటర్న్‌లను దాఖలు చేయడంలో విఫలమైన కంపెనీల బోర్డులలోని డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీని ప్రకారం సుమారు 3.09 లక్షల మంది డైరెక్టర్లపై వేటు పడుతుందని వివరించింది. వీరిలో మూడు వేల మంది డైరెక్టర్లు ఒక్కొక్కరు 20కి పైగా కంపెనీలలో డైరెక్టర్లుగా ఉన్నారని ప్రాథమిక విచారణలో తేలిందని ప్రభుత్వం వెల్లడించింది. ఒకే వ్యక్తి ఇన్ని కంపెనీలలో డైరెక్టర్‌గా ఉండటం చట్ట విరుద్ధమని పేర్కొంది.