బిజినెస్

పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయాన్ని సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 6: పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయాన్ని సహించేదిలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరు మిర్చి యార్డులో సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వింటాల్‌కు 4320 మద్దతుధరతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అదే ధరకు రైతులకు 48 గంటల్లోగా చెల్లించాలని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారని గుర్తుచేశారు. ప్రతి 15 రోజులకోసారి గిట్టుబాటు ధరలపై సమీక్ష జరుగుతుందని తెలిపారు. దళారులు, మధ్యవర్తుల బెడద లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి సరకు చేరేలా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం తేమ 8 శాతానికి మించరాదని, అంతకు మించి ఎక్కువగా ఉంటే ఇళ్ల వద్దే ఆరబెట్టుకుని విక్రయించాలని సూచించారు. లాభాపేక్షతో కాకుండా కేంద్రం నిర్ణయించిన ధర రైతులకు అందేలా సీసీఐ కొనుగోళ్లు జరపాలని కోరారు. ఏఎంసి చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో పత్తి రికార్డు స్థాయిలో సాగు జరిగిందన్నారు. పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. సీసీఐ సీనియర్ కాటన్ పర్చేజ్ మేనేజర్ అలగ్జాండర్ మాట్లాడుతూ రైతుల నాణ్యత గల సరకు నిబంధనల ప్రకారం విక్రయిస్తే సీసీఐ చెల్లింపులో ఎలాంటి వ్యత్యాసం ఉండదన్నారు. కేంద్ర టెక్స్‌టైల్ కమిటీ నిర్ణయించిన ప్రకారం చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. తేమ, దుమ్ము, ధూళి లేకుండా రంగు మారకుండా ఉన్న పత్తిని తీసుకువస్తేనే గిట్టుబాటుధర లభిస్తుందని స్పష్టంచేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. యార్డు అధికారులు, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత యార్డులో ఏర్పాటైన సీసీఐ కేంద్రానికి తరలించిన పత్తిని మంత్రి బయ్యర్ల ద్వారా కొనుగోలు ప్రారంభించారు.

చిత్రం..గుంటూరు మిర్చి యార్డులో పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తున్న మంత్రి పుల్లారావు