బిజినెస్

చందన్‌వెల్లిలో మోడల్ ప్లాస్టిక్ పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ప్లాస్టిక్ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా ఉందని రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ప్లాస్టిక్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో 200 ఎకరాలు కేటాయించి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు. మంఖాల్-తుమ్మలూరులో వంద ఎకరాల్లో ప్రతిపాదిత ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అనుమతి తీసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుపై చైర్మన్ గ్యాదరి బాలమల్లు సోమవారం ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్, మాజీ అధ్యక్షుడు వి. అనిల్‌రెడ్డి తదితరులతో సమీక్షించారు. ఐఐసి అధికారులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలమల్లు మాట్లాడుతూ తెలంగాణకు గుర్తింపు వచ్చేలా మోడల్ ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న ప్లాస్టిక్ పరిశ్రమల తరలింపు విస్తరణలో భాగంగానే 2014లో మంఖాల్‌లో గ్రీన్ ప్లాస్టిక్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు. ఇలాఉండగా ప్రతిపాదనలో ఉన్న మంఖాల్ ప్లాస్టిక్ పార్కును వేగంగా అభివృద్ధి చేసి కాటేదాన్ చిన్న తరహా పరిశ్రమల యజమానులకు స్థలాలు కేటాయించాలని తెలంగాణ, ఆంధ్ర ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల సంఘం నాయకులు చైర్మన్‌ను కోరారు. అందుకు చైర్మన్ బాలమల్లు స్పందిస్తూ ఈ విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే తాను పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్ళి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.