బిజినెస్

పెట్టుబడులు పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 6: విశాఖలో టచ్ ప్యానెల్ తయారీ కంపెనీ ఏర్పాటుకు గొట్ట్ఫోన్ టెక్నాలజీ సంస్థ ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం సమావేశమయ్యారు. మొదటి దశలో భాగంగా ఈ సంస్థ 504 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. 300 మందికి ఉద్యోగాలను కల్పించనుంది. ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అనేక విధానాలు అమల్లోకి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. తిరుపతి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో మొబైల్ ఫోన్‌లో ఉపయోగించే బ్యాటరీ సహా ఇతర విడిభాగాలు తయారు చేసే కంపెనీలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. అనంతపురంలో ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్ క్లస్టర్‌లో కూడా తమ యూనిట్లను ప్రారంభించేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌గా ఏపి మారబోతోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలకు అవసరమైన అన్ని అనుమతులు, భూ కేటాయింపులు త్వరితగతిన కల్పిస్తున్నామన్నారు. అనుకున్న సమయానికే మొదటి దశ పూర్తిచేయాలని ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు.