బిజినెస్

నిధుల మళ్లింపుపై నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 6: ‘ప్యారడైజ్ పత్రాల’లో పేరున్న విజయ్ మాల్యాకు చెందిన సంస్థలు సహా తన వద్ద లిస్టయిన వివిధ సంస్థలు, వాటి ప్రమోటర్లు అక్రమంగా నిధుల మళ్లింపునకు పాల్పడ్డాయా, కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఏమైనా లోపాలున్నాయా అనే అంశాలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) లోతుగా పరిశీలించనుంది. మాల్యాకు సంబంధం ఉన్న కొన్ని కంపెనీలపై సెబీ, ఇతర సంస్థలు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నాయి. అయితే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసిఐజె) ‘ప్యారడైజ్ పేపర్స్’ పేరిట బహిర్గతం చేసిన పత్రాలలో మాల్యాకు, ఆయనతో సంబంధం ఉన్న సంస్థలకు సంబంధించి ఇంకేమైనా కొత్త అంశాలు బయటపడితే, ఆయా అంశాలపై దర్యాప్తు చేయనున్నట్టు సీనియర్ అధికారులు సోమవారం ఇక్కడ తెలిపారు. ప్యారడైజ్ పత్రాల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు వెలుగు చూసిన ఇతర లిస్టెడ్ సంస్థలు, వాటితో అనుబంధం ఉన్న సంస్థలు, వాటి ప్రమోటర్లపైనా సెబీ దృష్టి సారిస్తుందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా నిధుల అక్రమ బదిలీ జరిగిందా? కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఏమైనా లోపాలున్నాయా? అనే అంశాలను పరిశీలించనున్నట్టు వారు చెప్పారు. అయితే భారత్‌కు చెందిన ఏ సంస్థ అయినా విదేశాలలోని పన్ను రాయితీలు (ట్యాక్స్ ఫ్రెండ్లీ) ఉన్న ప్రాంతాలకు విస్తరించినంత మాత్రాన అది చట్టాలను ఉల్లంఘించినట్లు కాదని, కాని, ఆ సంస్థలు ఆ వివరాలను వెల్లడించి ఉండకపోతే, వాటికి నిధులను మళ్లించి ఉంటే, లోతుగా దర్యాప్తు జరిపిన పిమ్మట అవి చట్టాలను ఉల్లంఘించాయా? లేదా? అనే విషయాన్ని అంచనా వేస్తామని ఆ అధికారులు వివరించారు. ఈ దర్యాప్తులో భాగంగా తొలుత ప్యారడైజ్ పత్రాలలో పేరున్న లిస్టయిన కంపెనీలను వాటికి విదేశాలలో అనుబంధ సంస్థలు ఉన్నాయా? ఉంటే వాటి వివరాలను ఇవ్వాలని సెబీ అడుగుతుంది. ఆ కంపెనీలు అంతకు ముందు సమర్పించిన వార్షిక నివేదికలు, ఇతర పత్రాలలో పేర్కొన్న వివరాలతో వీటిని పోల్చి చూస్తుంది. అవసరమైతే, విదేశీ నియంత్రణ సంస్థల నుంచి సమాచారాన్ని కోరేందుకు సెబీ ఇతర నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలతో కూడా సమన్వయంతో వ్యవహరిస్తుందని ఒక అధికారి తెలిపారు. ఫైనాన్షియల్ స్టెబిలిటి అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్‌ఎస్‌డీసీ) లేదా అలాంటి ఇతర వేదికలపై బహుళ నియంత్రణ వైఖరిపై చర్చించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని మీడియా భాగస్వాములతో కలిసి ఐసిఐజె 13.4 మిలియన్ ఫైళ్లను బహిర్గతం చేసింది. ప్రపంచంలోని కొందరు శక్తివంతమయిన నేతలు, కంపెనీలు విదేశాలలో జరిపిన ఆర్థిక కార్యకలాపాలను ఈ ప్యారడైజ్ పత్రాలు బయటపెట్టాయి.