బిజినెస్

మాల్యా ఇక ‘ప్రకటిత అపరాధి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) నిబంధనలను ఉల్లంఘించిన కేసులో సమన్లు స్వీకరించకుండా తప్పించుకుంటున్న విజయ్ మాల్యాను ప్రకటిత అపరాధి (ప్రొక్లెయిమ్డ్ అఫెండర్)గా ప్రకటించే ప్రక్రియకు ఢిల్లీలోని ఒక కోర్టు బుధవారం శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 18లోగా తన ముందు హాజరు కావడానికి కోర్టు మాల్యాకు చివరి అవకాశం ఇచ్చింది. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) దీపక్ శేహ్రవత్ మాల్యాను ఘోషితాపరాధిగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభిస్తూ, తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించారు. ఈడీ తరపున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్‌కే మట్టా.. మాల్యాకు వ్యతిరేకంగా ఇదివరకు గడువు లేకుండా జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యు) అతనికి చేరకుండా తిరిగి వచ్చిందని తెలియజేస్తూ, నేర శిక్షాస్మృతిలోని సెక్షన్ 82, 83ల కింద అతడిని ప్రకటిత అపరాధిగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించడం మినహా ఈడీకి మరో ప్రత్యామ్నాయం లేదని విన్నవించిన తరువాత చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం సహా ఈడీ వివిధ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా కోర్టు ఏప్రిల్ 12న గడువు లేని ఎన్‌బీడబ్ల్యును జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యు)లాగా కాకుండా గడువు లేని ఎన్‌బీడబ్ల్యును అమలు చేయడానికి ఎలాంటి కాలపరిమితి ఉండదు.