బిజినెస్

రెండో రోజూ అమ్మకాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 8: దేశీయ మార్కెట్లలో వరుసగా రెండో రోజు బుధవారం కూడా అమ్మకాల జోరు కొనసాగింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం 152 పాయింట్లు పడిపోయి వారం రోజుల కనిష్ట స్థాయి 33,218.81 పాయింట్లకు చేరింది. లోహపు, చమురు- సహజ వాయువు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థిరాస్థి రంగాల షేర్లలో విస్తృత స్థాయిలో అమ్మకాలు జరగడం వల్ల సెనె్సక్స్ భారీగా పడిపోయింది. 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ బుధవారం ఉదయం 33,417.35 పాయింట్ల వద్ద పటిష్ఠమయిన స్థితిలో ప్రారంభమయి, తరువాత మరింత పుంజుకొని ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి అయిన 33,484.70 పాయింట్లను తాకింది. విదేశీ నిధులు మార్కెట్‌లోకి రావడంతో సెనె్సక్స్ పైకి దూసుకెళ్లింది. అయితే, మధ్యాహ్నం తరువాత జరిగిన లావాదేవీల్లో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో ఇంట్రా-డేలో కనిష్ట స్థాయి అయిన 33,157.68 పాయింట్లకు దిగజారింది. చివరలో కొంత పుంజుకొని క్రితం ముగింపుతో పోలిస్తే 151.95 పాయింట్లు (0.46 శాతం) నష్టపోయి 33,218.81 పాయింట్ల వద్ద స్థిరపడింది. అక్టోబర్ 31 తరువాత సెనె్సక్స్ ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 31న సెనె్సక్స్ 33,213.13 పాయింట్లకు పడిపోయింది. విశాలమయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా బుధవారం 47 పాయింట్లు (0.45 శాతం) తగ్గి, 10,303.15 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఇంట్రా-డేలో నిఫ్టీ 10,384.25- 10,285.50 పాయింట్ల మధ్య కదలాడింది.