బిజినెస్

మార్కెట్లోకి కొత్త ‘ఎకోస్పోర్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ ఇండియా ఎంతో ప్రజాదరణ పొందిన తమ కాంపాక్ట్ ఎస్‌యువి ‘ఎకోస్పోర్ట్’ని సరికొత్త హంగులతో గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభ్యమయ్యే ఈ అప్‌డేటెడ్ వెర్షన్ ధరను రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షలుగా నిర్ణయించారు. 1.5 లీటర్ల సామర్ధ్య కలిగిన సరికొత్త ఇంజన్‌తో రూపొందించిన అప్‌డేటెడ్ పెట్రోల్ వెర్షన్ వాహనం లీటర్ ఇంధనంతో 17 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని, రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షల ధరకు ఈ వాహనం లభిస్తుందని ఫోర్డ్ ఇండియా డైరెక్టర్, ప్రెసిడెంట్ అనురాగ్ మెహ్రోత్రా గురువారం న్యూఢిల్లీలో విలేఖరులకు తెలిపారు. అయితే అప్‌డేటెడ్ డీజిల్ వెర్షన్ వాహనంలో మాత్రం గతంలో ఉన్న ఇంజిన్‌నే అమర్చామని, రూ.8.01 లక్షల నుంచి రూ.10.67 లక్షలకు లభ్యమయ్యే ఈ వాహనం లీటర్ ఇంధనంతో 23 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఆయన వివరించారు.