బిజినెస్

రూ.6,500 కోట్ల పెట్టుబడులతో రామగుండంలో మెగా పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 9: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజక వర్గానికి మహర్దశ రాబోతోందని... అనతి కాలంలోనే ఇక్కడ 6500 కోట్ల రూపాయలతో విదేశీ సంస్థ ఆధ్వర్యంలో మెగా పరిశ్రమ నిర్మాణం కాబోతోందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ తెలిపారు. గురువారం గోదావరిఖని పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఓ విదేశీ సంస్థ భారత దేశంలో మూడు మెగా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని, దీనిలో భాగంగానే మహారాష్టల్రోని చంద్రాపూర్, మరోటి కోర్బాలో, మూడవది తెలంగాణలోని రామగుండంలో మెగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఆ సంస్థ 6500 కోట్ల రూపాయలతో రామగుండంలో భారీ పరిశ్రమ నిర్మాణానికి అవకాశం దక్కడం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు మంత్రి కెటిఆర్ కృషేనని పేర్కొన్నారు. నీరు, బొగ్గు, విద్యుత్‌తోపాటు రైల్వేమార్గం ఉన్న కారణం వల్ల రామగుండంలో మెగా పరిశ్రమ ఏర్పాటుకు సులువు కాబోతోందని వివరిస్తూ ఈ భారీ పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని కూడా ఎంపిక చేసిందన్నారు. అయితే ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తరువాత ఏర్పాటు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుతో సుమారుగా 5 వేల మందికి, పరోక్షంగా మరో వేలాది మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా సింగరేణి బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న గని కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి పూర్తిగా కట్టుబడి ఉన్నారని, ఎన్ని సంఘాలు కుట్ర చేసిన కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని అన్నారు. బీఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలను బాల్క సుమన్ ఈ సందర్భంగా నీచ సంఘాలుగా అభివర్ణించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్