బిజినెస్

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించే అరుదైన అవకాశం తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందున ప్రతిభను చాటుకుని పని చేసి విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సదస్సు నిర్వహణలో పాల్గొంటున్న అన్ని శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసి సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు అద్భుతంగా చేపట్టాలని అన్నారు. గురువారం సచివాలయంలో సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన ప్రతిరోజు పనులను వివిధ కమిటీల బాధ్యులు సమీక్షిస్తూ ముందుకెళ్లాలని అన్నారు. అలాగే సబ్‌కమిటీలు అంతర్గతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రపంచ స్థాయి ప్రముఖులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఆదేశించారు. విమానాశ్రయంలో దిగిన అతిధులకు వెల్‌కం కిట్లు, ట్రావెల్ రూట్ మ్యాప్స్, బస్సుల వరకు ఎస్కార్ట్‌లకు వాలంటీర్లతో సహకారం అందే విధంగా చూడాలని చెప్పారు. హోటళ్లలో తగు బస, రవాణా భద్రత ఏర్పాట్లతో పాటు హెచ్‌ఐసిసిలో కంట్రోల్ సెంటర్, ఆహ్వానితుల రిజిష్ట్రేషన్‌కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సదస్సు కోసం నియమించిన వాలంటీర్లు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేయాలని అన్నారు. ఈ నెల 28న జరిగే ప్రారంభోత్సవంలో ప్లీనరీ సెషన్, ప్యానల్ డిస్కషన్, వర్క్‌షాప్ వంటివి ఉంటాయని వివరించారు. సదస్సుకు 1200 మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారని, వీరందరి కోసం 28వ తేదీన ఫలక్‌నుమా ప్యాలెస్, 29న గోల్కొండ హోటల్‌లో విందు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు తగిన భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టాలని సిఎస్ పోలీసు శాఖను ఆదేశించారు.