బిజినెస్

నేటి నుంచి భారత్‌నెట్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: దేశంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2019 మార్చి నాటికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు దాదాపు రూ.34 వేల కోట్లతో చేపట్టబోతున్న భారత్‌నెట్ రెండవ, తుది దశ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. టెలికామ్ శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్, వైఫై ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అదనంగా 10 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ లైన్లతో 1.5 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధానించి, టెలికామ్ ఆపరేటర్లకు 75 శాతం తక్కువ ధరతో బ్యాండ్‌విడ్త్‌ను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆమె తెలిపారు. ‘2019 మార్చి నాటికి 1.5 లక్షల గ్రామ పంచాయతీలను హైస్పీడ్ బ్రాండ్‌బ్యాండ్ లైన్లతో అనుసంధానించేందుకు ఉద్దేశించిన భారత్‌నెట్ చివరి దశ ప్రాజెక్టును సోమవారం ప్రారంభించబోతున్నాం. దేశంలో తొలి విడతగా లక్ష గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు గతంలో ప్రారంభించిన భారత్‌నెట్ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు టెలికామ్ సంస్థలు కనీసం 2 ఎంబిపిఎస్ (మెగాబైట్స్ పర్ సెకెండ్) వేగంతోనైనా ఇంటర్నెట్ సేవలను అందిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని ఆమె చెప్పారు. టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా, న్యాయ, ఐటి శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం భారత్‌నెట్-2 ప్రాజెక్టును ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందజేసే పాక్షిక ఆర్థిక సాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు సొంతగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తాయి. ఇందుకు సంబంధించి ఏడు రాష్ట్రాల (మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్)తో ఒప్పందాలను కుదుర్చుకోనుంది. మొత్తం 45 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భారత్‌నెట్ ప్రాజెక్టును చేపట్టిన ప్రభుత్వం ఈ నిధుల్లో 11,200 కోట్ల రూపాయలను తొలి దశ పనుల కోసం ఉపయోగించింది.

చిత్రం..వివరాలను వెల్లడిస్తున్న కేంద్ర టెలికామ్ శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్