బిజినెస్

ప్రైవేటు ఫైనాన్స్‌పై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 14: ప్రైవేటు వడ్డీవ్యాపారంపై ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది..నిబంధనలు కఠినతరం చేయటంతో పాటు నిర్దేశించిన వడ్డీ రేట్లను మాత్రమే వసూలు చేయాలని.. అధిక వడ్డీ వసూలుచేస్తే జైలుశిక్ష, జరిమానా విధించే విధంగా ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును మంగళవారం డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప శాసనసభలో ప్రవేశపెట్టగా దానిని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పటి వరకు వడ్డీ వ్యాపారులకు వర్తించే ఏకీకరణ శాసనం అమలులోలేదు. దీనిపై ఎంపికచేసిన కమిటీ ఇచ్చిన సూచనలను అనుసరించి 2000 సంవత్సరంలో వడ్డీవ్యాపారుల బిల్లును అప్పటి శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే చట్టబద్ధత కల్పించలేదు. ఈ నేపథ్యంలో 2015లో రాష్ట్ర శాసనమండలి బిల్లును ఆమోదించింది. ఈ బిల్లులోని 254(2)ను సవరిస్తూ రాష్టప్రతి, గవర్నర్‌కు పంపారు. బిల్లును పునస్సమీక్ష నిమిత్తం కేంద్రం తిప్పి పంపింది. ప్రస్తుతం ఉన్న శాసనాలను రద్దుచేస్తూ కొత్తగా బిల్లును రూపొందించారు. ఈ ప్రకారం లైసెన్స్ పొందిన వడ్డీ వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించరాదు. ఒక్కో లైసెన్స్‌దారు పరిమితిని బట్టి రూ. 5 నుంచి 2.5 లక్షల వరకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
ఏటా ఆడిటింగ్, తనిఖీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. డిపాజిటర్లను మోసంచేసినట్లు గుర్తిస్తే లైసెన్స్ రద్దుచేస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ వడ్డీరేటునే వసూలు చేయాలి. ఇచ్చిన అప్పుకు సంబంధించి చెల్లించాల్సిన డబ్బును లేదా ఆస్తిని పూర్తిగా లేక వాయిదా పద్దతిలో స్వీకరించేందుకు నిరాకరించినప్పుడు కోర్టులో దావా వేయడం ద్వారా చెల్లింపులు జరుపుకునే విధంగా బిల్లులో వెసులుబాటు కల్పించారు. వడ్డీ వ్యాపారుల అకౌంటు పుస్తకాలు, లైసెన్స్‌ను తనిఖీచేసే సమయంలో అందుబాటులో ఉంచాలి. అధిక వడ్డీ వసూలుచేస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష వరకు జరిమానా ఉంటుంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే ప్రత్యేకన్యాయస్థానంలో విచారణ జరిపి అందుకు అనుగుణంగా శిక్షించే విధంగా చట్టసవరణ చేస్తూ రూపొందించిన ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.