బిజినెస్

భారతీయులకు వీసా నిబంధనల్లో సడలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారతీయులకు వీసా నిబంధనలను వచ్చే జనవరి 1వ తేదీ నుంచి సడలించాలని, తమ దేశంలో తాత్కాలిక విడిది కోసం వచ్చేవారికి ‘బహుళ ప్రవేశ వీసా’లను జారీ చేయాలని జపాన్ నిర్ణయించింది. పర్యాటకులకు, వ్యాపారులకు, తరచూ వచ్చే సందర్శకుల కోసం ఈ సడలింపులు ఉంటాయని ఇక్కడి జపాన్ రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈ సడలింపులతో వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సులభతరమవడమే కాకుండా, అర్హత గల అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఉపాధికి సంబంధించిన ధ్రువీకరణ, తాత్కాలిక విడిదికి కారణాలను తెలిపే లేఖలను ఇక ‘బహుల ప్రవేశ వీసా’లకు సమర్పించనవసరం లేదు. పాస్‌పోర్ట్ వీసా దరఖాస్తు (అభ్యర్థి ఫొటో సహా), ఆర్థిక పరిస్థితికి సంబంధించిన పత్రం (టూరిస్టులకు), వాణిజ్య సంబంధాలకు తగిన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. బహుళ ప్రవేశ వీసా గరిష్ట కాలపరిమితి 5 ఏళ్లు అయినప్పటికీ జపాన్‌లో 90 రోజులకు మించకుండా తాత్కాలికంగా విడిది చేసేందుకు వీలుంటుంది. పర్యాటకం, వాణిజ్యం, వ్యాపార రంగాల్లో భారత్‌తో సంబంధాలను మరింతగా పెంచుకునేలా జపాన్ తన వీసా నిబంధనల్లో ఈ సడలింపులను ప్రకటించింది. భారతీయ విద్యార్థులకు సంబంధించి వీసా నిబంధనలను గత ఫిబ్రవరిలోనే జపాన్ సరళీకరించింది.