బిజినెస్

ఆహార ఆదాయం అదరహో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 14: భారతదేశంలో ఆహార సర్వీసుల పరిశ్రమ అనూహ్య రీతిలో విస్తరించే అవకాశాలు మెరుగవుతున్నాయని తాజాగా ఓ నివేదికలో స్పష్టమైంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఆహార సర్వీసుల మార్కెట్ 5.52 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఫిక్కీ-టెక్నోపాక్ సంస్థ జరిపిన ఈ సర్వేలో స్పష్టమైంది. అంటే వార్షికంగా పదిశాతం చొప్పున భారతదేశ ఆహార సర్వీసుల మార్కెట్ విస్తరించే అవకాశం ఉందని ఈ నివేదిక విశే్లషించింది. భారతదేశంలో ఆహార సేవా రంగానికి ఉన్నంత ఆదరణ, విలువ, డిమాండ్ దేనికీ లేదని, అందుకే ఇది విస్తృత స్థాయిలో వృద్ధి చెందే అవకాశాలు అంతే ఎక్కువగా ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. కేవలం డిమాండ్‌తో పాటు అత్యధిక స్థాయి లాభాలను ఆర్జించే అవకాశం ఉన్న రంగంకూడా ఇదేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో డిమాండ్ పెరగడం, అంతటా కూడా దీనిపై ఆసక్తి కనబరచడం ఇందుకు కారణమని వెల్లడించింది. లాభాలతోపాటు అత్యధిక స్థాయిలో నేరుగా ఉపాధిని కల్పించే రంగం కూడా ఇదేనని వెల్లడించింది. 2016లో దాదాపు 60లక్షల మందికి ప్రత్యక్షంగా ఈ రంగం ఉపాధిని కల్పించిందని, 2021 నాటికి ఈ రంగంలో ఉపాధి పొందేవారి సంఖ్య 80 లక్షల నుంచి 90 లక్షల వరకు ఉండవచ్చునని వెల్లడించింది. అలాగే పరోక్షంగా కూడా ఈ రంగం లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తోందని, 2021 నాటికి దీని సంఖ్య ఆరు శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ఆహార సర్వీసుల మార్కెట్ విలువ 3.37 లక్షల కోట్ల రూపాయలని అంచనా వేసింది. మొత్తం ఆహార సర్వీసుల మార్కెట్‌లో 22 శాతాన్ని ముంబయి, ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతాలు సంతరించుకున్నాయని, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి ఆరు మినీ మెట్రోలు ఈ విషయంలో ద్వితీయ స్థానంలో ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. అంటే మొత్తం ఆహార మార్కెట్‌లో వీటి వాటా 20 శాతం వరకు ఉందని వెల్లడించింది. దేశంలో ఇంత విస్తృత స్థాయిలో ఆహార సర్వీసుల మార్కెట్‌కు డిమాండ్ పెరగడానికి కారణం యువత, జనాభాలో పనిచేసేవారి సంఖ్య పెరగడమేనని స్పష్టం చేసింది. అలాగే పర్యాటక రంగం కూడా విస్తరించడమూ ఈ పరిశ్రమ ఆదాయాన్ని మరింతగా పెంచిందని తెలిపింది. అలాగే ప్రజల ఆదాయం కూడా పెరగడం వల్ల బయట తిండికి అలవాటుపడటమూ ఆహార సర్వీసుల పరిశ్రమ శక్తివంతం కావడానికి దోహదం చేసిందని తెలిపింది. భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు కూడా వివిధ రూపాల్లో అందుబాటులో ఉండటం, ఈ ఆహార పదార్థాల విక్రయానికి రిటైల్ అవకాశాలు ఉండటం కూడా ఈ డిమాండ్‌కు మరో ప్రధాన కారణమని స్పష్టం చేసింది. దేశీయ, అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు, వెంచర్ కాపిటలిస్టులు కూడా ఆహార సేవా రంగంపై దృష్టి పెట్టడం వల్ల నభూతో నభవిష్యత్తు అనే రీతిలో ఉపాధి, ఆదాయం, డిమాండ్ పరంగా ఆహార సేవా రంగం విస్తరిస్తోందని నివేదిక వెల్లడించింది.