బిజినెస్

రొయ్యల పెంపకంపై ప్రభుత్వం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, నవంబర్ 15: వందశాతం రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలు అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎవరూ చేయని విధంగా రొయ్యల పెంపకానికి సాహసం చేసింది. ఇందుకోసం పది ప్రాజెక్టులు, చెరువులు ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా రొయ్యలు పెంచేందుకు శ్రీకారం చుట్టింది. మత్స్యశాఖ అధికారులు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలతో సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ధీటుగా తెలంగాణలో సైతం రొయ్యల ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టుల్లో రొయ్య విత్తనం వేస్తున్నారు. ఇందులో ఎంపిక చేసిన మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్టులో బుధవారం 6.20 లక్షల రొయ్య విత్తనాలను మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి, మత్స్యశాఖ ఉప సంచాలకులు శ్రీనివాస్, జిల్లా సహాయ సంచాలకులు లక్ష్మీనారాయణ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాజెక్టుల వారీగా రొయ్య విత్తనం వేస్తున్నట్లు ఉప సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. సింగూరు ప్రాజెక్టులో 59 లక్షలు, పోచారంలో 6.30 లక్షలు, కోయల్‌సాగర్‌లో 4.50 లక్షలు, వైరా వద్ద 7 లక్షలు, పాలేరులో 6.50 లక్షలు, సింగభూపాలంలో 1.80 లక్షలు, ఎల్‌ఎండీలో 30 లక్షలు, కడెం ప్రాజెక్టులో 9 లక్షలు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో 27 లక్షలు మొత్తం కోటిన్నర రొయ్య విత్తనం వేయడానికి చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఇందుకోసం 1.90 కోట్ల బడ్జెట్ వ్యయమవుతుంది. రొయ్య విత్తనం సరఫరా చేయడానికి టెండర్లు ఆహ్వానించగా ఐదు సంస్థలు ముందుకు వచ్చాయ, ఇందులో రెండు సంస్థలు ఎంపిక కాగా 1.28 పైసలకు ఒక రొయ్య సరఫరా చేయడానికి ముందుకొచ్చిన సంస్థ నుండి విత్తనం తెప్పించి ప్రాజెక్టులు, చెరువుల్లో వేస్తున్నారు. నీలకంఠ రొయ్య రకం తొందరగా ఎదగడమే కాకుండా దృఢంగా ఉండి అన్నింటినీ ఎదుర్కొనే శక్తి ఉంది. ఆరు నెలలు పెంచితే మంచి ఎదుగుదలతో బాగా దిగుబడి వస్తుందని డీడీ శ్రీనివాస్ మత్స్యకారులకు సూచించారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న రొయ్యల పెంపకం ఈసారి విజయవంతమైతే వచ్చే ఏడాది 60-70 ప్రాజెక్టులు, పెద్ద చెరువుల్లో పెంచే అవకాశం ఉం ది. ఈ ప్రయోగం ఎంతవరకు సఫలీకృతమైతే ఇతర రాష్ట్రాల్లో సైతం రొయ్యల పెంపకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

రొయ్యల ఉత్పత్తే లక్ష్యం

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వందశాతం రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలను అందజేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో వారి వ్యాపారం బాగానే సాగుతోంది. వారికి ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు సైతం అందజేసి ఆదుకుంటున్నారు. అంతేకాకుండా మార్కెటింగ్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చికెన్, మాంసంనకు బదులు చేపలు, రొయ్యలు తినేందుకు జనం ఇష్టపడుతున్నారు. వైద్యులు సైతం అదే సలహా ఇస్తున్నారు. తెలంగాణలో కూడా చేపలతోపాటు రొయ్యలకు బాగానే గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రొయ్యల పెంపకానికి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపడుతోంది. సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇది విజయవంతమైతే మరో నీలివిప్లవ విజయంగా చెప్పుకోవచ్చు.