బిజినెస్

రెండేళ్లలో ఏపీలోనూ బంగాళదుంప పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: బంగాళదుంపల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడుతూ వస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ఇకపై ఆ ఇబ్బంది లేదు. మన రాష్ట్రంలోనే బంగాళదుంపలు పండించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ రీజనల్ రీసెర్చ్ సైంటిస్ట్ మొహిందర్ సింగ్ తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిఐఐ, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, డల్‌బెర్గ్ సంయుక్తంగా విశాఖలోని సిఐఐ గ్రౌండ్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఏపి అగ్రిటెక్ సమ్మిట్-2017లో బుధవారం ఉద్యానవన రంగంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర అన్న అంశంపై ప్యానల్ డిస్కషన్ జరిగింది. ఇందులో పాల్గొన్న మొహిందర్ సింగ్ మాట్లాడుతూ బంగాళదుంప పంటకు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు అనువుగా ఉన్నాయని అన్నారు. మహారాష్ట్ర, పంజాబ్ నుంచి బంగాళదుంపలను ఆంధ్ర ప్రదేశ్ దిగుమతి చేసుకుంటోంది. ఇకపై బంగాళదుంపలను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోనవసరం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న కోరాపుట్‌లోనే బంగాళ దుంపలు విరివిగా పండుతున్నాయని ఆయన చెప్పారు. బంగాళదుంప సాగుకు కావల్సిన కూలీలంతా ఆంధ్రప్రదేశ్ నుంచే వెళుతున్నారని ఆయన చెప్పారు. పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు ఉన్న ప్రాంతాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్న గుజరాత్‌లో బంగాళదుంపలను పండిస్తున్నారని, అటువంటిది నీటికి కోరత లేని కోస్తా జిల్లాల్లో ఈ పంటను పండించవచ్చని అన్నారు. రబీ సీజన్‌లో బంగాళదుంప సాగు అనువుగా ఉంటుందని ఆయన తెలియచేశారు. ఈ ప్రాంతానికి అనువైన విత్తనాలను తయారు చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని సింగ్ వెల్లడించారు. రెండేళ్లలో ఏపిలో బంగాళ దుంపలు ఉత్పత్తి ఆరంభమవుతుందని ఆయన వివరించారు.