బిజినెస్

ఇటు ఉపాధి... అటు పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 15: అగ్రరాజ్యం అమెరికా గడ్డపై భారతీయ కంపెనీలు వేళ్లూనుకున్నాయా? అవుననే అంటోంది కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ). అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని గణాంకాలతో సహా సీఐఐ పేర్కొంది. భారతీయ కంపెనీలు అమెరికాలో సుమారు 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, ఒక లక్షా 13వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించినట్టు సీఐఐ ‘అమెరికా గడ్డపై భారతీయ కంపెనీల వేళ్లు’ అనే శీర్షికతో రూపొందించిన తన నివేదికలో వెల్లడించింది. భారతీయ కంపెనీలు అమెరికాలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 147 మిలియన్ డాలర్లు, పరిశోధన, అభివృద్ధి కోసం 588 మిలియన్ డాలర్లు వ్యయం చేశాయని సీఐఐ మంగళవారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. అమెరికా, కరీబియన్ ద్వీపకల్పమైన పుయెర్టో రికోలో వ్యాపారం చేస్తున్న వంద భారతీయ కంపెనీలు పెట్టిన ప్రత్యక్ష పెట్టుబడులు, కల్పించిన ఉద్యోగాల వివరాలను రాష్ట్రాల వారీగా సీఐఐ వెల్లడించింది. ఈ వంద భారతీయ కంపెనీలు కలిసి 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్స్ ఆఫ్ కొలంబియా, పుయెర్టో రికోలో కలిపి 1,13,423 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు సీఐఐ తన నివేదికలో తెలిపింది. ఈ కంపెనీలన్నీ కలిసి 17.9 బిలియన్ డాలర్లకు పైగా ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టాయని పేర్కొంది. భారతీయ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగాలు కల్పించిన మొదటి అయిదు రాష్ట్రాలలో న్యూజెర్సీ (8,572 ఉద్యోగాలు), టెక్సాస్ (7,271 ఉద్యోగాలు), కాలిఫోర్నియా (6,749 ఉద్యోగాలు), న్యూయార్క్ (5,135 ఉద్యోగాలు), జార్జియా (4,554 ఉద్యోగాలు) ఉన్నాయని సీఐఐ తన నివేదికలో వివరించింది. ఈ నివేదిక ప్రకారం భారతీయ కంపెనీలు అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెట్టిన తొలి అయిదు రాష్ట్రాలలో న్యూయార్క్ (1.57 బిలియన్ డాలర్లు), న్యూజెర్సీ (1.56 బిలియన్ డాలర్లు) మసాచుసెట్స్ (931 మిలియన్ డాలర్లు), కాలిఫోర్నియా (542 మిలియన్ డాలర్లు, వ్యోమింగ్ (435 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.