బిజినెస్

ఎనీటైం హెల్త్ మిషన్ ప్రారంభించిన ‘మాక్స్ బుపా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: భారతీయ ఆరోగ్య బీమా చరిత్రలో తొలిసారిగా ఒక వినూత్న ఆవిష్కరణ ‘ఎనీ టైం హెల్త్(ఎటిహెచ్)’ను ప్రవేశపెడుతున్నట్లు మాక్స్ బుపా తెలిపింది. ఆరోగ్య బీమా పొందాలనుకునే వారి ఆరోగ్య పరిస్థితులను కేవలం 180 సెకండ్లలో అంచనా వేసి తద్వారా ఆరోగ్య బీమా పొందేందుకు వీలుగా ప్రారంభించిన కొత్త ఆవిష్కరణ ఎటిహెచ్ అని మాక్స్ బుపా ఎండి, సిఈఓ ఆశిష్ మెహరోత్రా పేర్కొన్నారు. ఆరోగ్య బీమా తీసుకోవడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ అయిన యోలోహెల్త్ భాగస్వామ్యంతో మాక్స్ బుపా ఎటిహెచ్ మెషీన్లు రూపొందించడం జరిగిందని అన్నారు. 2017లో ప్రారంభించిన మాక్స్ బుపా తదుపరి నిర్వహించిన పల్స్ సర్వేలో 47 శాతం మంది ఆరోగ్య బీమాను పునరుద్దరించుకునేందుకు ఆన్‌లైన్ వేదికను ఎంపిక చేశారని వివరించారు. ఆరోగ్య బీమా కొనుగోలుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నట్లుగా 13 శాతం మంది వెల్లడించారని తెలిపారు. అత్యంత సులభమైన పద్దతిలో ఎనీటైమ్ హెల్త్ పని చేస్తుందని వివరించారు.
బీ-డప్స్ ఔట్‌లెట్
జూబ్లీహిల్స్‌లో ప్రారంభం
యుఎస్‌ఏ రెస్టారెంట్ చైన్ బఫెలో వైల్డ్‌వింగ్స్ అకా బీ-డబ్స్ ఔట్‌లెట్‌ను ప్రముఖ హాస్పిటాలిటీ బ్రాండ్ అయిన ఎం కిచెన్ సంస్థ హైదరాబాద్‌కు తీసుకు వచ్చింది. ఈ ఔట్‌లెట్‌ను యువ హీరో అల్లు అర్జున్ ఎం కిచెన్‌తో చేతులు కలిపి జూబ్లీహిల్స్‌లో ప్రారంభించారు. తొలి ఫ్లాగ్‌షిప్ రెస్టారెంట్, అంతర్జాతీయంగా అతి పెద్ద బి-డబ్స్‌లో ఒకటైన ఈ రెస్టారెంట్ నగర వాసులకు కొత్త అనుభూతిని కల్పిస్తుందని వివరించారు. బీ-డబ్స్ బ్రాండ్ అసాధారణ అనుభవాలను సున్నితమైన సిగ్నేచర్ సాస్‌లు, చికెన్ వింగ్స్‌తో అందించడం మాత్రమే కాదని అద్భుతమైన స్పోర్ట్స్ వాతావరణంలో ఏర్పాటు చేసినట్లు ఎంకిచెన్ ఒక ప్రకటనలో తెలిపింది.