బిజినెస్

స్థిరాస్తి రంగం కుదేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: ఈ సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), నిరుటి పెద్ద నోట్ల రద్దు దేశంలో ద్రవ్య చలామణికి సంబంధించిన సమస్యలను సృష్టించడమే కాకుండా నగరాలలో పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపిందని, ఫలితంగా నగరాల ర్యాంకింగ్ దిగజారిందని ఒక నివేదిక వెల్లడించింది. అర్బన్ ల్యాండ్ ఇన్‌స్టిట్యూట్, కన్సల్టెన్సీ పిడబ్ల్యూసీ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాల ప్రకారం, జీఎస్‌టీ అమలు, నోట్ల రద్దు ప్రభావం ముందుగా దేశంలోని నగరాలలో పెట్టే పెట్టుబడులు, చోటు చేసుకునే అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో నిరుడు ప్రాధాన్యత గల స్థానాల్లో ఉన్న దేశంలోని నగరాలు ఈ సంవత్సరం కిందికి పడిపోయాయి. 600 పైచిలుకు మంది పెట్టుబడిదారులు సహా స్థిరాస్తి రంగం వృత్తి నిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ రియల్ ఎస్టేట్.. ఆసియా పసిఫిక్ 2018’ శీర్షికతో ఈ నివేదికను రూపొందించారు. ‘దేశంలో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ప్రత్యేకించి ప్రజలు భరించగలిగే ఇళ్ల నిర్మాణంలో పెట్టుబడులు వ్యూహాత్మకంగానే కొనసాగుతున్నాయి. ఈ రంగం వల్ల పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తున్నాయి’ అని పిడబ్ల్యూసీ ఇండియా లీడర్, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అభిషేక్ గోయెంకా తెలిపారు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయి 2018లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యత గల నగరాలలో ఈ ఏడాది 12వ స్థానానికి పడిపోయింది. ఈ విషయంలో నిరుడు ద్వితీయ స్థానంలో ఉన్న ముంబయి ఏకంగా పది స్థానాలు దిగజారింది. అభివృద్ధి అవకాశాల రీత్యా చూస్తే ముంబయి ర్యాంకింగ్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. జీఎస్‌టీ, నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం ముంబయిపైనే కాకుండా బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలపైనా పడింది. నిరుడు పెట్టుబడులకు ప్రాధాన్యత గల నగరాలలో అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు ఈ ఏడాది 15వ స్థానానికి పడిపోయింది. అలాగే నిరుడు 13వ స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ ఏడాది 20వ స్థానానికి పడిపోయింది. అభివృద్ధి అవకాశాల ర్యాంకింగ్‌లో బెంగళూరు 16వ స్థానంలో, ఢిల్లీ 18వ స్థానంలో నిలిచాయి. ఎక్కువ మంది అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌లో నివాస స్థలాల అభివృద్ధి కన్నా వాణిజ్య స్థలాల అభివృద్ధి పట్ల ఆసక్తి చూపుతున్నారని కూడా ఈ సర్వే వెల్లడించింది.