బిజినెస్

ద్రవ్యలోటుకు కళ్లెం కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 21: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) కారణంగా తలెత్తిన సమస్యలు, వౌలిక సదుపాయాలపై భారత ప్రభుత్వం పెడుతున్న ఖర్చు పెరగడం వల్ల నిర్దేశిత 3.2 శాతం ద్రవ్యలోటు పెరిగిపోయే అవకాశం ఉందని ఫ్రాన్స్‌కు చెందిన బ్రోకరేజి సంస్థ బిఎన్‌పి పరిబాస్ హెచ్చరించింది. జిఎస్‌టి అమలు అనంతరం ఎంత మేరకు రెవెన్యూ వసూలవుతుందన్నది స్పష్టంగా లేదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేవరకూ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఈ అంతర్జాతీయ ఆర్థిక సర్వీసుల సంస్థ మంగళవారం జారీచేసిన నివేదికలో స్పష్టం చేసింది. ఈసా రి కూడా ద్రవ్యలోటును 3.2 శాతానికి కుదించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఎంతమాత్రం సఫలమయ్యే అవకాశాలు కనిపించడం లేదని తెలిపింది. స్థూల జాతీయోత్పత్తిలో ద్రవ్యలోటును 3.2 శాతానికి కుదించాలని మోదీ సర్కార్ లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటికీ జిఎస్‌టి తదితర నిర్ణయాల కారణంగా ఇది సాధ్యమయ్యే అవకాశం లేదని తెలిపింది. వీటికి తోడు ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోవడమూ పరిస్థితి మరింత జటిలం కావడానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని అందుకోలేకపోవడానికి కారణం కావచ్చునని వెల్లడించింది. అయితే ఎంతమేరకు ద్రవ్యలోటు పెరుగుతుందన్న దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విధానపరమైన చర్చలు, పరిశ్రమ నిపుణులు, బ్యాంకర్లు, దేశీయ ఇనె్వస్టర్లతో మాట్లాడిన అనంతరం ఈ సంస్థ ఈ నివేదికను రూపొందించింది.