బిజినెస్

సుబాబుల్ రైతుల సమస్యలపై 29న తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేయడానికి ఈ నెల 29న తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రుల బృందం బుధవారం నిర్ణయించింది. సుబాబుల్ రైతులకు ఒక్కో జిల్లాలో ఒక్కో ధర నిర్ణయించడం సరికాదని, రాష్టమ్రంతా ఒకే ధర ఉండేలా చూడాలని ఇందుకు అడ్డుగా ఉన్న నిబంధన తొలగించాలని బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రుల బృంద సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సుబాబుల్, యూకలిప్టస్ రైతులు దళారీలు, కంపెనీల కుమ్మక్కుల వల్ల ధర రాక నానా కష్టాలు పడుతున్నారని ఈ సమావేశంలో మంత్రుల బృందం అభిప్రాయపడింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, మార్కెటింగ్, గిడ్డంగులు, పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ, సహకార శాఖల మంత్రి ఆదినారాయణ రెడ్డి, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి సిద్దా రాఘవరావు, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు సుబాబుల్ రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. 2004 వరకు ఈ రైతాంగానికి సమస్య లేదని, అప్పట్లో రాష్టమ్రంతా ఒకే ధర ఉండేదని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అప్పట్లో నాలుగు పేపర్ మిల్లులు రైతుల నుంచి కొనుగోలు చేసేవి. ఈ పోటీ వల్ల రైతుకు గిట్టుబాట ధర ఉండేదని మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. ఇప్పుడు ఐటిసి భద్రాచలం, రాజమండ్రి పేపర్ మిల్లులే కొంటున్నాయి. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు రైతులకు రూ.16 కోట్లు బకాయిపడి ఇన్‌సాల్వేషన్ పెట్టేశారని అధికారులు వివరించారు. రైతుల్ని మభ్యపెడుతూ అక్కడ తక్కువ రేటు ఉందని చెప్పడమే కాక నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి రవాణా చార్జీలు కూడా వసూలు చేస్తున్నారని రైతుల ప్రతినిధులు ఈ సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కొన్ని నెలల క్రితం విడుదలైన జీవో నెం.493 సుబాబుల్ కొనుగోలుకు ప్రైవేట్ వ్యాపారుల్ని అనుమతిస్తున్నారని, ప్రైవేట్ వ్యాపారులు లాబీ నిర్వహిస్తూ రైతులకు తక్కువ ధర వచ్చేలా వ్యవహారాల్ని నడుపుతున్నారని సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ రెండు జీవోల గురించి రెండు మూడు రోజుల్లో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల రైతాంగంతో ఆయా జిల్లాల మంత్రులు విడివిడిగా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు.
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ టెండర్ల ద్వారా సుబాబుల్, యూకలిప్టస్ విక్రయిస్తోంది. ఈ నెల 29న నిర్వహించనున్న మంత్రుల బృంద సమావేశానికి అటవీ అభివృద్ధి సంస్థ అధికారుల్ని, నాలుగు జిల్లాల సంయుక్త కలెక్టర్లను, మార్కెటింగ్, వ్యవసాయ అధికారుల్ని ఆహ్వానించాలని మంత్రులు నిర్ణయించారు. ఈ సమావేశంలో తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండు జీవోలను రద్దు చేసే అవకాశాలున్నాయి.