బిజినెస్

బయో మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 23: వౌలిక వసతులు, పరిశోధనలను అభివృద్ధి చేస్తూ బయో మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ జోషి అన్నారు. గురువారం ఎయు, ఒమిక్స్ పబ్లిషింగ్ గ్రూప్ సంయుక్తంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఎన్విరాన్‌మెంటల్ బయో టెక్నాలజీపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బయో టెక్నాలజీ శాఖకు రూ.2, 222.11 కోట్ల నిధులు అందజేశామన్నారు. గత ప్రభుత్వాల కంటే 22 శాతం అధికంగా నిధులను కేటాయించామన్నారు. నేషనల్ బయోటెక్ స్ట్రాటజీకి అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐటీ రంగంతో సమానంగా బయోటెక్ రంగాన్ని అభివృద్ధి చేస్తూ, 2025 నాటికి వంద బిలియన్ డాలర్ల టర్నోవర్‌ను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పర్యావరణ సమస్యలకు బయోటెక్నాలజీ పరిష్కారం చూపగలదన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం వ్యవసాయ ఉత్పత్తి లభించే దిశగా బయోటెక్నాలజీ అవసరమైన తోడ్పాటును అందిస్తుందన్నారు. ప్రపంచంలో ఇంధన అవసరం పెరుగుతోందన్నారు. 2011 నాటికి 31 జిటిల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు ఉన్నాయని, 2035 నాటికి వీటి శాతం 37 జిటిలకు పెరుగుతుందన్నారు. బయో ఎనర్జీతో కర్బన ఉద్గారాలను నియంత్రించడం సాధ్యపడుతుందన్నారు. 2035 నాటికి 20 నుంచి 30 శాతం వరకు బయో ఎనర్జీని వినియోగిస్తారన్నారు. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, ఒమిక్స్ పబ్లిషింగ్ గ్రూప్ సిఈఓ గేదెల శ్రీనుబాబు, ఐఐపీఈ సంచాలకులు ఆచార్య విఎస్‌ఆర్‌కె ప్రసాద్, ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పిఎస్ అవధాని, ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ హెన్‌డ్రికస్ వాన్ డార్డ్ కన్వీనర్ ఆచార్య డి.శ్రీరామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్.ఎం యుగంధర్, విభాగాధిపతి ఆచార్య ఎస్.వి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ప్రతినిధులను సత్కరిస్తున్న ప్రహ్లాద్ జోషి