బిజినెస్

ఆ ఊసేదీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో డిజిటల్ (నగదు రహిత) లావాదేవీలను ప్రోత్సహించాలన్న ప్రణాళికలో భాగంగా బ్యాంకు ఖాతాదారులకు చెక్‌బుక్ సదుపాయాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. ‘చెక్ బుక్ సదుపాయాన్ని రద్దు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజయం లేదు. అటువంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఏడాది క్రితం దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఇప్పుడు బ్యాంకు చెక్‌బుక్‌లను నిషేధించాలని యోచిస్తున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం విదితమే. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సమీప భవిష్యత్తులో చెక్‌బుక్ సదుపాయాన్ని రద్దు చేసే అవకాశం ఉందని అఖిల భారత వర్తక సమాఖ్యకు చెందిన సీనియర్ అధికారి ప్రవీణ్ ఖండేల్వాల్ ఇటీవల పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. అయితే డిజిటల్, ఎలక్ట్రానిక్ లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ బ్యాంకు చెక్‌బుక్ సదుపాయాన్ని రద్దు చేయాలన్న ఆలోచనేమీ లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. చెల్లింపుల వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న చెక్‌బుక్ సేవలు వర్తక, వాణిజ్య రంగాలకు వెనె్నముక లాంటివని, వాణిజ్య లావాదేవీలకు ఇవి ఎంతో సురక్షితమైనవిగా ఉపకరిస్తున్నాయని, కనుక ఆ సేవలను రద్దు చేయాలన్న ప్రతిపాదన గానీ ఆలోచన గానీ లేదని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది.