బిజినెస్

పెరిగిన ఫోరెక్స్ నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 24: విదేశీ కరెన్సీ ఆస్తులు వృద్ధి చెందడంతో దేశంలో విదేశీ మారకద్రవ్య (్ఫరెక్స్) నిల్వలు ఈ నెల 17వ తేదీతో ముగిసిన వారంలో 240.4 మిలియన్ డాలర్లు పెరిగి 399.533 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు వారంలో ఈ నిల్వలు 554.2 మిలియన్ డాలర్లు పెరిగి 399.293 డాలర్లకు చేరుకున్నాయి. దేశంలోని మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో సింహభాగంగా ఉండే విదేశీ కరెన్సీ నిల్వలు ఈ నెల 17వ తేదీతో ముగిసిన వారంలో 220.4 మిలియన్ డాలర్లు పెరిగి 375.096 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అయితే బంగారం నిల్వల్లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా 20.666 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయని రిజర్వు బ్యాంకు వెల్లడించింది.