బిజినెస్

సరికొత్త వెర్షన్‌లో యమహా ఎంటీ-09 సూపర్ బైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థల్లో ఒకటైన యమహా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ సరికొత్త వెర్షన్ ఎంటీ-09 సూపర్ బైక్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. 847 సీసీ సామర్ధ్యం కలిగిన 3-సిలిండర్ ఇంజన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్) టెక్నాలజీతో తీర్చిదిద్దిన ఈ కొత్త వెర్షన్ బైక్ ఢిల్లీలో 10.88 లక్షల రూపాయల ఎక్స్-షోరూమ్ ధరకు లభ్యమవుతుందని ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. పూర్తిగా విదేశంలో రూపొందించిన ఈ బైక్‌ను భారత్‌కు దిగుమతి చేయడం జరుగుతుందని, 600 సీసీ కంటే అధిక సామర్ధ్యం కలిగిన స్పోర్ట్స్ బైకుల పట్ల మక్కువ చూపుతున్న యువతతో పాటు లార్జ్ డిస్‌ప్లేస్‌మెంట్ (మరీ ఎక్కువ సామర్ధ్యం కలిగిన) బైకుల కంటే కొంచెం తక్కువ సామర్ధ్య కలిగివున్న బైకులను కొనుగోలు చేయాలనుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బైకును అందుబాటులోకి తీసుకొచ్చామని యమహా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ విభాగ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రాయ్ కురియన్ ఆ ప్రకటనలో వివరించారు.