బిజినెస్

ఉల్లి ఘాటుకు టమోటా తోడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: ఉల్లి ‘ఘాటు’తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇప్పుడు టమోటా ధరలు కూడా వెక్కిరిస్తున్నాయి. సరఫరాలు తగ్గడంతో ప్రస్తుతం న్యూఢిల్లీలో కిలో టమోటా ధర 80 రూపాయలకు పెరిగింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టమోటా ధరలు దాదాపు ఇదేవిధంగా ఉన్నాయి. టమోటాలను ఎక్కువగా ఉత్పత్తిచేసే రాష్ట్రాల్లో ఒకటైన కర్నాటక రాజధాని బెంగళూరు రిటైల్ మార్కెట్లలో ప్రస్తుతం కిలో టమోటా 45 నుంచి 50 రూపాయలు పలుకుతుండగా, మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో వీటి ధర ఏకంగా 95 నుంచి 100 రూపాయలకు దూసుకెళ్లింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో టమోటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దీంతో ప్రస్తుతం వాటి లభ్యత చాలా తక్కువగా ఉందని ఆజాద్‌పూర్ మండీ (మార్కెట్) టమోటా వర్తకుల సంఘం అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపారు. వర్షాల వలన మధ్యప్రదేశ్‌లో టమోటా పంటకు దాదాపు 90 శాతం నష్టం వాటిల్లడంతో వ్యాపారులకు సరఫరాలు తగ్గాయని, ఆ రాష్ట్రంలో రైతులు మళ్లీ టమోటా పంట వేసినప్పటికీ మరో 20 రోజుల వరకూ దిగుబడి వచ్చే అవకాశాలు లేవని అశోక్ కౌశిక్ వివరించారు.
కాగా, ఆసియాలోనే అతిపెద్ద పండ్లు, కూరగాయల మార్కెట్‌గా ఖ్యాతి పొందిన ఆజాద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో టమోటా ధర దాదాపు 50 రూపాయలకు చేరుకోవడంతో రిటైల్ మార్కెట్లలో వీటిని మరింత ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఢిల్లీ రిటైల్ మార్కెట్లలో ఏడాది క్రితం 35 రూపాయలు పలికిన కిలో టమోటాలను ఇప్పుడు నాణ్యతను బట్టి దాదాపు 80 రూపాయలకు అమ్ముతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఢిల్లీలో టమోటా సరఫరాలు దాదాపు 25 శాతం మేరకు తగ్గడమే ఇందుకు కారణం. ఢిల్లీలో ప్రధానమైనవిగా పరిగణించే ఆరు పెద్ద మండీల్లో రోజుకు సరాసరి 225 నుంచి 250 టన్నుల టమోటా విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం సరఫరాలు తగ్గడంతో అక్కడ టమోటా వ్యాపారం 180 టన్నులకు పడిపోయింది.