బిజినెస్

ఏడో రోజూ లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 24: వరుసగా ఏడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్లు సానుకూల పథంలోనే పయనించాయి. శుక్రవారం జరిగిన లావాదేవీల్లో మార్కెట్ దూకుడుకు ఐటి షేర్లు ఊతాన్నిచ్చాయి. లావాదేవీలు ముగిసే నాటికి బీఎస్‌ఈ సెనె్సక్స్ 91.16 పాయింట్లు (0.27 శాతం) పుంజుకుని 33,679.24 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 40.95 పాయింట్లు (0.40 శాతం) పుంజుకుని 10,389.70 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో వినియోగ వస్తువుల కంపెనీలు, ఐటి కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. ప్రధానంగా ఇన్ఫోసిస్ షేరు విలువ 1.87 శాతం మేర పుంజుకోగా, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ బ్యాంక్ షేర్లు కూడా లాభాలను ఆర్జించాయి. ఎస్‌బీఐ షేరు విలువ 0.79 శాతం తగ్గినప్పటికీ వినియోగ వస్తువుల తయారీ కంపెనీల షేర్లతో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు మార్కెట్‌కు ఊతాన్నిచ్చాయి. దీంతో ఈ వారం మొత్తం మీద సెనె్సక్స్ 336.44 పాయింట్లు (1 శాతం) వృద్ధి చెందగా, నిఫ్టీ 106.10 పాయింట్లు (1.03 శాతం) పుంజుకుని 10,400 పాయింట్లకు కొంచెం దిగువన ముగిసినట్లయింది.