బిజినెస్

జీఎస్‌టీ వసూళ్లు భారీగా పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో గత నెల వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు భారీగా తగ్గాయి. సెప్టెంబర్ రూ.92 వేల కోట్లకు పైగా ఉన్న ఈ వసూళ్లు అక్టోబర్‌లో రూ.83,346 కోట్లకు పడిపోయాయి. జీఎస్‌టీలోని చాలా వస్తువులపై ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించడమే ఇందుకు కారణం. అక్టోబర్ నెలకు సంబంధించి జీఎస్‌టీ కింద నవంబర్ 27వ తేదీ నాటికి మొత్తం రూ.83,346 కోట్ల వసూళ్లు జరిగాయని, గత నెలలో 50.1 లక్షల రిటర్న్‌లు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. జీఎస్‌టీ నష్టపరిహారం కింద జూలై, ఆగస్టు నెలల్లో రాష్ట్రాలకు రూ.10,806 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు గాను రూ.13,695 కోట్లను విడుదల చేస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2015-16 ఆర్థిక సంవత్సర ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో పాటు అది 14 శాతం పెరుగుతుందన్న అంచనాతో రాష్ట్రాల ఆదాయాన్ని పూర్తిగా పరిరక్షిస్తున్నామని ఆర్థిక శాఖ పేర్కొంది. దేశంలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలి నెల (జూలై)లో రూ.95 వేల కోట్లకు పైగా వసూళ్లు జరిగాయి. ఆగస్టులో ఇవి రూ.91 వేల కోట్లకు తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో రూ.92,150 కోట్లకుపైగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.