బిజినెస్

స్వచ్ఛ వ్యాపారానికే ఆర్డినెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా స్వచ్ఛమైన రీతిలో నిజాయితీగా వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన దివాళా ఆర్డినెన్స్ ఎంతగానో ఉపకరిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారికి ఏరకమైన ఊరటను కల్పించే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన ఆయన, ఇలాంటి వ్యక్తులు ఆస్తులను దివాళా ప్రక్రియ ద్వారా తిరిగి స్వాధీనం చేసుకునేందుకూ ఈ ఆర్డినెన్స్ ఎలాంటి అవకాశం ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఈ దివాళా కంపెనీల ప్రమోటర్లు కొందరు లోపాయికారీగా భారీ డిస్కౌంట్లతో ఆస్తులను తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్న ఆయన ‘ఇలాంటి ప్రయత్నాలను ప్రజా ధన దుర్వినియోగాన్ని నియంత్రించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది’ అని తెలిపారు. అవకతవకలతో వ్యాపారాలు సాగిస్తున్న వ్యాపారవేత్తల నుంచి ప్రజాధనాన్ని పరిరక్షించడానికే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ ఆర్డినెన్స్‌లో చాలా స్పష్టమైన సందేశం ఉందని, వ్యాపారం అన్నది నిజాయితీగానే చేయాలని, లేనిపక్షంలో దాని నుంచి పూర్తిగా తప్పుకోవాలన్నదే ఈ ఆర్డినెన్స్ అంతిమ లక్ష్యమని తెలిపారు. ఏవిధంగానూ రుణాల ఎగవేతదారులకు వెసులుబాటు కల్పించే ప్రసక్తి లేదని ఉద్ఘాటించారు. డిఫాల్టర్లతోపాటు, వ్యాపారాన్ని అవకతవకల రీతిలో సాగించేవారినీ ఈ ఆర్డినెన్స్ అన్ని విధాలుగా కట్టడి చేస్తుందన్నారు. బ్యాంకుల నంచి తీసుకున్న రుణాలను బాధ్యతాయుతంగా ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఉపయోగించుకునే వారిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తెచ్చిందన్నారు. 2008 నుంచి 14 సంవత్సరాల మధ్య దాదాపు 34 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు రుణాలుగా ఇచ్చాయని, వీటి చెల్లింపులు సక్రమంగా జరగకపోయినా కూడా ఇలాంటి కేసులను వాస్తవికంగా రాని బాకీలుగా ప్రకటించడం జరగలేదని, అదేవిధంగా ఇలాంటి వారికి మళ్లీ రుణాలిస్తూ పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టేవారిని లక్ష్యంగా చేసుకుని గత వారం ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని, వీటి పరిధిలోకి ఎన్‌పిఏ అకౌంట్ కలిగినవారు కూడా వస్తారని తెలిపారు. వీరిందరి నుంచీ కూడా ఇన్సాల్వెన్సీ ప్రక్రియ కింద కచ్చితంగా బకాయిలు వసూలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకు ఈ ఆర్డినెన్స్ అన్ని విధాలుగా దోహదం చేస్తుందని, దివాళా చట్టం కింద 12 కార్పొరేట్ సంస్థల నుంచి 1.72లక్షల కోట్ల రూపాయలను వసూలు చేసే ప్రక్రియను ఆర్బీఐ ఇప్పటికే ప్రారంభించిందని తెలిపారు. అలాగే, భారీగా రుణాలు ఎగవేసిన ఈ కేసులను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించడం జరిగిందన్నారు. మొత్తం ఎన్‌పిఏల్లో ఈ పనె్నండు కంపెనీల బకాయిలే 20 శాతం ఉన్నాయని తెలిపారు. వీటిలో ఎస్‌ఆర్ స్టీల్, లాంకో ఇన్‌ఫ్రాటెక్, జెపి ఇన్‌ఫ్రాటెక్, భూషణ్ స్టీల్ లిమిటెడ్ మొదలైనవి ఉన్నాయి.