బిజినెస్

ఏడేళ్లలో రెండింతలు పెరుగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వచ్చే అయిదేళ్లలో రెండింతలు పెరిగి అయిదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2030 నాటికి పది ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 21వ శతాబ్దం మధ్య నాటికి జీడీపీలో భారత్ చైనాను మించిపోతుందని ఆయన అన్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అంబానీ శుక్రవారం ఇక్కడ హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. 500 బిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ రానున్న 20 ఏళ్లలో అయిదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని 2004లోనే తాను అంచనా వేసి, చెప్పానని అంబానీ గుర్తు చేశారు. ఈ రోజు తన అంచనా నిజమవుతోందని, అయితే తాను అప్పట్లో ఊహించిన 2024 కన్నా చాలా ముందే భారత్ ఈ లక్ష్యాన్ని సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ రానున్న పదేళ్లలో మూడింతలు పెరిగి, ఏడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పది ట్రిలియన్ డాలర్ల మైలు రాయిని అధిగమిస్తుందని అన్నారు. భారత్ ఈ శతాబ్దంలోనే అమెరికా, చైనాలను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశంగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, ప్రజాస్వామ్యం, సుపరిపాలన, విశాలమయిన సహానుభూతి సంస్కృతి గల సమాజం ఆధారంగా భారత్ ఉన్నతమయిన, విశిష్ఠమయిన అభివృద్ధి నమూనాను అందిస్తుందని, ఈ అభివృద్ధి నమూనా న్యాయబద్ధమయిన, సంఘటిత వృద్ధిని సమకూరుస్తుందని అంబానీ పేర్కొన్నారు. ‘్భరత్ ప్రపంచ ఆర్థిక నేతగా ఎదుగుతుంది’ అనే అంశంపై అంబానీ మాట్లాడుతూ మొదటి పారిశ్రామిక విప్లవం భౌతిక కార్యకలాపాలను యాంత్రీకరించడానికి బొగ్గు, ఆవిరి శక్తిని ఉపయోగించుకుందని, రెండో పారిశ్రామిక విప్లవం విస్తృత స్థాయిలో ఉత్పత్తిని సాధించడానికి, పంపిణీ చేయడానికి విద్యుచ్ఛక్తిని, చమురును ఉపయోగించుకుందని, మూడో పారిశ్రామిక విప్లవం ఉత్పత్తిని మరింత పెంచడానికి, యాంత్రికీకరణకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని ఉపయోగించుకుందని ఆయన వివరించారు. తొలి రెండు పారిశ్రామిక విప్లవాలలో భారత్ వెనుకబడి పోయిందని, కంప్యూటర్ ఛోదక మూడో పారిశ్రామిక విప్లవాన్ని మాత్రం అందిపుచ్చుకుందని ఆయన విశే్లషించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఇప్పుడు మన ముందు ఉందన్నారు. కనెక్టివిటి, కంప్యూటింగ్, డాటా, కృత్రిమ మేధస్సు ఈ నాలుగో పారిశ్రామిక విప్లవానికి పునాదిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
భారత్ ఈ నాలుగో పారిశ్రామిక విప్లవంలో పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించే అవకాశం ఉందని అన్నారు.