బిజినెస్

భద్రత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: రైల్వేలో భద్రత, సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ అన్నారు. భద్రత, నిర్వహణ వంటి అంశాల్లో దక్షిణ మధ్య రైల్వే అద్భుతంగా పని చేస్తోందని ప్రశంసించారు. ఉత్తర, దక్షిణ భారత దేశ కార్యాచరణ పద్దతులను సమన్వయం చేస్తూ తనదైన ప్రత్యేక గుర్తింపును నిలుకుంటున్నదని కొనియాడారు. బుధవారం రైల్వే బోర్డు చైర్మన్ లోహాని తొలిసారి దక్షిణ మధ్య రైల్వేను సందర్శించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్యారేజ్ వర్క్‌షాప్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం జోనల్ ప్రధాన కార్యాలయం రైల్ నిలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ కూడా రైల్వే బోర్డు చైర్మన్ వెంట సందర్శించారు. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన అశ్వనీ లోహాని మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో స్టేషన్ నిర్వహణ కొనసాగుతోందని అభినందించారు. సిసిటివి కెమెరాల నిర్వహణ, భద్రత పరంగా తీసుకుంటున్న చర్యలను స్వయంగా ఆయన పరిశీలించారు. స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుతున్నందుకు గాను స్టేషన్ సిబ్బందికి రూ.లక్ష అవార్డును అక్కడికక్కడే ప్రకటించారు. అనంతరం లాలాగూడలోని సిడబ్ల్యూఎస్ వర్క్‌షాప్‌ను సందర్శించారు. అక్కడ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ అర్జున్ ముండియా, చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ విజయ్‌కుమార్‌తో మాట్లాడారు. వర్క్‌షాప్‌లో వినియోగించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి, కోచ్ నిర్వహణ సదుపాయం దేశంలోనే ప్రసిద్ధి చెందిందని వారు చైర్మన్‌కు వివరించారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత రైల్ నిలయంకు చేరుకున్న చైర్మన్ ఉన్నతాధికారులతో, వీడియో కానె్ఫరెన్స్‌లో పాల్గొన్న డిఆర్‌ఎంలతో సమీక్షించారు. పని చేసే చోట మహిళా ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉద్యోగుల పనితీరును సరళతరం చేస్తూ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ యాదవ్ ద.మ.రైల్వే ప్రగతిని, పనితీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చైర్మన్ లోహానికి వివరించారు.
24 తత్కాల్ వారాంతపు ప్రత్యేక రైళ్లు
యశ్వంత్‌పూర్-విశాఖపట్నం-యశ్వంత్‌పూర్ మధ్య 24 వారాంతపు ప్రత్యేక తత్కాల్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీ (ప్రతి శుక్రవారం)ల్లో యశ్వంత్‌పూర్ నుంచి నెం.06579 రైలు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి నెం.06580 రైలు ప్రతి ఆదివారం అంటే ఈ నెల 10, 17, 24, 31, జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో బయలుదేరుతుందని రైల్వే తెలిపింది.