బిజినెస్

తెలంగాణ ఆతిథ్యరంగంలోకి ఓయో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణలో భారత దేశపు అతిపెద్ద ఆతిథ్య రంగ కంపెనీ ఓయో అడుగుపెట్టింది. ఆతిథ్యరంగంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఓయో తన నూతన టెక్ డెవలెప్‌మెంట్ సెంటర్‌ను హైదారాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఆతిథ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిన ఓయో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు భాగస్వామ్యం చేసుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని అన్నారు. నిథమ్, టిఎస్‌టిడిసి వంటి సంస్థలతో భాగస్వామ్యం చేసుకునే అవకాశాలను సైతం ఓయో అనే్వషిస్తుందని మంత్రి తెలిపారు. ఓయో వ్యవస్థాపకుడు, సిఈఓ రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ భారత దేశపు ఆతిథ్య అనుభవాలను సమూలంగా మార్చడంలో తమ సంస్థ ముందుందని అన్నారు. యాత్రికులకు అత్యద్భుతమైన లివింగ్ స్పేస్‌ను అందించడంలో సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

చిత్రం.. హైదారాబాద్‌లో శుక్రవారం ఓయో నూతన
టెక్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్