బిజినెస్

జాతీయ స్థాయిలో సింగరేణి థర్మల్ ఖ్యాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (జైపూర్) నవంబర్‌లో 90.28 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో 7వ స్థానాన్ని పొందిందని ఆ సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. 2017లో థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో మూడుసార్లు మొదటి 10 స్థానాల్లో నిలిచినందుకు ఉద్యోగులను అభినందిస్తూ, ఇకముందు కూడా మెరుగ్గా పని చేయాలని కోరారు. శుక్రవారం నాడిక్కడ సింగరేణి భవన్‌లో ఆయన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో సంస్థ ముందంజలో ఉండాలని కోరారు. కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటు పనులు బిహెచ్‌ఈఎల్‌కు ఇటీవల అప్పగించిన నేపథ్యంలో నిర్మాణ సంబంధ విషయాలను సమీక్షించారు.
సమీక్షలో చీఫ్ కో ఆర్డినేటర్ ఎల్.లక్ష్మీనారాయణ, ఈడి సంజయ్ కుమార్ సూర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.